పాలు, జున్ను, పెరుగులో విటమిన్ ఎ తో పాటు జింక్ కూడా ఉంటుంది. జింక్ విటమిన్ ఎ రెటీనాకు చేరడానికి సహాయపడుతుంది. అయితే పాలు, పెరుగును మితంగా తీసుకోవడం మంచిది.
పాలకూర, ఇతర ముదురు ఆకుపచ్చ కూరగాయలలో విటమిన్ ఎ తో పాటు లుటీన్, జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కళ్ళను హానికరమైన కాంతి నుండి రక్షిస్తాయి. ఆకుకూరలను స్మూతీస్‌లో వేసుకోవచ్చు, సలాడ్స్‌లో కలుపుకోవచ్చు లేదా వెల్లుల్లితో కలిపి వండుకోవచ్చు.
క్యారెట్లు కంటికి చాలా మంచివి. వీటిలో బీటా-కెరోటిన్ అనే విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి, రేచీకటిని నివారించడానికి, వయసుతో వచ్చే చూపు తగ్గడాన్ని అడ్డుకోవడానికి సహాయపడుతుంది. క్యారెట్లను పచ్చిగా తినొచ్చు, వండొచ్చు లేదా జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు.
చిలగడదుంపల్లో విటమిన్ ఎ చాలా ఎక్కువ. ఒక చిన్న సైజు చిలగడదుంప తింటే చాలు.. రోజుకి కావలసిన విటమిన్ ఎ లో రెండింతల కంటే ఎక్కువ అందుతుంది. వీటిని కాల్చి, మెత్తగా చేసి, లేదా ఫ్రైస్ లాగా కూడా తినొచ్చు.
గుడ్లలో కూడా విటమిన్ ఎ ఉంటుంది. ముఖ్యంగా గుడ్డు పచ్చసొనలో ఈ పోషకం ఎక్కువ. గుడ్లలో లుటీన్, జియాక్సంతిన్ కూడా ఉంటాయి. ఇవి మచ్చల క్షీణతను నివారిస్తాయి. చూపును పదునుగా ఉంచుతాయి. గుడ్లను ఉడకబెట్టి, స్క్రాంబుల్డ్ ఎగ్స్ లాగా లేదా ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు.
చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇవి కంటి పొడిబారడాన్ని తగ్గిస్తాయి, కంటి పనితీరును మెరుగుపరుస్తాయి. చేపలు తినని వాళ్ళు చేప నూనె సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.