
కనురెప్పలపై చుండ్రు అనేది కంటి రెప్పలపై బ్యాక్టీరియా పేరుకుపోయినప్పుడు వస్తుందట. అంతేకాకుండా ఆయిల్ ఫేస్, పొడికళ్ళు వంటి సమస్యలు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందంటున్నారు. కనురెప్పలపై చుండ్రు ఉన్నప్పుడు కంటిపై తెలుపు లేదా పసుపు రంగు పొరలు, దురద, కళ్ళు ఎర్రగా మారడం, చూపు మందగించడం, వెలుతురును సరిగ్గా చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు రోజు గోరువెచ్చని నీటితో కాటన్ క్లాత్ ను ముంచి ఐదు నుంచి పది నిమిషాల పాటు కళ్ళను శుభ్రపరుచుకోవాలి. దాంతో కాస్త ఉపశమనం కలుగుతుంది. కనురెప్పలపై చుండ్రు ఏర్పడటం వలన కంటి ఇన్ఫెక్షన్, పొడికళ్ళు, సైట్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు ఈ లక్షణాలు తీవ్రతరమైతే కార్నియా దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుందంటున్నారు.