థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే.. మరోసారి దుమ్మురేపనున్న రగులుతుంది మొగలిపొద

థియేటర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే.. మరోసారి దుమ్మురేపనున్న రగులుతుంది మొగలిపొద


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వశిష్ట గతంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కిన బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు విశ్వంభర సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి : ఈయన ఆయనేనా..! ఏంటీ.. ఆ స్టార్ హీరో రవితేజ సినిమాలో నటించాడా..!! గుర్తుపట్టారా మావ

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేయనున్నారు. ఈ స్పెషల్ సాంగ్ కు భీమ్స్ సంగీతం అందించనున్నారని తెలుస్తుంది. కీరవాణి సినిమా మొత్తంకు సంగీతం అందిస్తుండగా.. కేవలం స్పెషల్ సాంగ్ కు భీమ్స్ సంగీతం అందిస్తున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సాంగ్ లో బాలీవుడ్ అందాల భామ మౌని రాయ్ మెగాస్టార్ తో డాన్స్ చేయనుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే విశ్వంభర సినిమాలో మెగాస్టార్ ఐకానిక్ సాంగ్ రగులుతుంది మొగలిపొద సాంగ్ ను రీమేక్ చేయనున్నారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఇండస్ట్రీలో మరో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూశారు

ఖైదీ సినిమాలోని రగులుతోంది మొగలిపొద సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో చిరంజీవి, మాధవి డాన్స్ తో అదరగొట్టారు. ఇక ఇప్పుడు ఇదే సాంగ్ ను విశ్వంభర సినిమాలో రీమేక్స్  చేయనున్నారని తెలుస్తుంది. ఈ సాంగ్ థియేటర్స్ విశ్వంభర థియేటర్ లో దద్దరిల్లడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఒకప్పుడు ప్రేక్షకులను ఉర్రుతలూగించిన ఈ సాంగ్ ఇప్పుడు మరోసారి థియేటర్స్ లో దుమ్మురేపనుంది. కాగా మౌని రాయ్ బాలీవుడ్ లో నాగిని సీరియల్ తో పాపులర్ అయ్యింది. అలాగే ఆ సీరియల్ లో నాగినిగా అదరగొట్టింది. దాంతో ఇప్పుడు రగులుతుంది మొగలిపొద సాంగ్ లో మెప్పించనుందని అంటున్నారు.

ఇది కూడా చదవండి : సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *