ఇంటి కిచెన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఫ్రిజ్ ఒకటి. రోజువారీ ఆహార పదార్థాలను ఫ్రెష్ గా ఉంచే పని ఫ్రిజ్ చేస్తుంది. కానీ కొన్ని సార్లు ఫ్రిజ్ సరిగ్గా చల్లబరచకపోతే.. అందులో పెట్టిన ఫుడ్ త్వరగా పాడవుతుంది. ఇది కిచెన్ పనులను పెద్ద ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఫ్రిజ్ చల్లదనం తగ్గడానికి ఏ కారణాలు ఉంటాయో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం.
టెంపరేచర్ సెట్టింగ్స్
ఫ్రిజ్ లో టెంపరేచర్ స్థిరంగా ఉండకపోతే దాని పనితీరుపై ఎఫెక్ట్ పడుతుంది. కొన్నిసార్లు టెంపరేచర్ ను ఎక్కువగా లేదా తక్కువగా సెట్ చేస్తే.. ఫ్రిజ్ లో సరైన చల్లదనం ఉండదు. దీని వల్ల ఫుడ్ ఐటమ్స్ త్వరగా పాడవుతాయి. అందుకే టెంపరేచర్ సెట్టింగ్ ను సరిగ్గా అవసరానికి తగ్గట్టుగా ఉంచడం చాలా ముఖ్యం.
ఓవర్ లోడింగ్
ఫ్రిజ్ లో పెట్టే వస్తువుల పరిమితిని దాటి ఉంచితే.. లోపల గాలి ప్రసరణకు అంతరాయం కలుగుతుంది. గాలి సరిగ్గా తిరగకపోతే చల్లదనం సమానంగా ఫ్రిజ్ అంతటా విస్తరించదు. దీని వల్ల ఫ్రిజ్ పనితీరు బలహీనపడుతుంది. అందుకే ఫ్రిజ్ లో సరైన స్పేస్ ఉండేలా పదార్థాలను సక్రమంగా అమర్చాలి.
ఫ్రిజ్ ఉంచే ప్రదేశం తప్పు
ఫ్రిజ్‌ను ఉంచే లొకేషన్ కూడా దాని పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఫ్రిజ్ ను గోడలకు అతి దగ్గరగా లేదా ఓవెన్, గ్యాస్ స్టవ్, డిష్ వాషర్ లాంటి వేడి పరికరాల పక్కన ఉంచినట్లయితే.. బయట నుండి వచ్చే వేడి ప్రభావం ఫ్రిజ్ లోని చల్లదనాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల ఫ్రిజ్ చల్లదనాన్ని సమర్థవంతంగా ఉత్పత్తి చేయలేదు. కాబట్టి ఫ్రిజ్ చుట్టూ తగినంత గాలిచలనం ఉండేలా చూసుకోవాలి.
డస్ట్ డిపాజిట్
ఫ్రిజ్ వెనుక భాగంలో ఉండే కండెన్సర్ కాయిల్ ఫ్రిజ్ చల్లదనాన్ని నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ దీనిపై ధూళి లేదా చెత్త పేరుకుపోతే.. కాయిల్ వేడిని రిలీజ్ చేయలేకపోయి ఫ్రిజ్ పనితీరు మందగిస్తుంది. దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం ద్వారా ఫ్రిజ్ చల్లదనాన్ని మెరుగ్గా నిలుపుకోవచ్చు.
ఈ టిప్స్ అన్నీ పాటిస్తే మీ ఫ్రిజ్ ఎప్పటికప్పుడు అదిరిపోయేలా పనిచేస్తుంది. ఫ్రిజ్‌లో సరైన కూలింగ్ ఉండేలా చూసుకుంటే ఫుడ్ ఐటమ్స్ సేఫ్‌గా ఉంటాయి. పైగా కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది. మీరు ఫ్రిజ్‌లో ఏదైనా అసాధారణ మార్పును గమనిస్తే.. వెంటనే సరిచేసుకోవడం బెస్ట్.