
అస్వామ్ లోని ముకుల్ మావా నివాసి అయిన మానిక్ అలీకి తన భార్యతో విభేదాలు రావడంతో విడాకుల కోసం కోర్టుకు ఎక్కాడు. చాలా కాలం తర్వాత కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. దీంతో ఒక్కసారిగా సంతోషానికి లోనైన మానిక్ అలీ ఇంటికి రాగానే 40 లీటర్ల పాలతో స్నానం చేశాడు. ఇప్పుడు తన మనసు తేలికపడిందని తాను స్వేచ్ఛగా జీవించే అవకాశం వచ్చిందని మానిక్ చెబుతున్నాడు. తన భార్యకు మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఇప్పటికే రెండుసార్లు ఆమె తన ప్రియుడితో పారిపోయిందని మానిక్ అలీ చెప్పుకొచ్చాడు. కానీ తన కుమార్తె ముఖం చూసి తన భార్యను భరించారని ఎంత నచ్చ చెప్పిన ఆమె తనను తీరు మార్చుకోకపోవడంతో విడాకులిచ్చినట్లు తెలిపాడు. ఇప్పుడు తాను స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నానని అందుకే తనను తాను శుద్ధి చేసుకోవడానికి కోర్టు నుంచి ఇంటికి రాగానే 40 లీటర్ల పాలతో స్నానం చేశానని వెల్లడించాడు. కాగా ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.