సినిమాల్లోకి మరో స్టార్ కిడ్ రాబోతుంది. తండ్రి బాటలోనే పయనిస్తూ నటిగా తనను తాను నిరూపించుకునేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే నటనలో శిక్షణలో తీసుకుంటోన్న ఈ అమ్మాయి సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తన ఫొటోలు, వీడియోలతో నెటిజన్ల మదిని దోచుకుంది. ఇప్పుడు ఏకంగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ బ్యూటీ ఒక ఆడిషన్స్ కు హాజరైంది. దీనిని ఆమె తండ్రి, నటుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుని సంతోషంతో మురిసిపోయాడు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. ఇందులోఆ స్టార్ కిడ్ మరో అమ్మాయితో మాట్లాడుతూ కనిపించింది. దీనిని చూసిన నెటిజన్లు నటుడి కూతురిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సహజంగా నటించిందని, గుడ్ లుకింగ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. అదే సమయంలో మరికొందరు ఈ క్యూటీ అచ్చం రాధికా ఆప్టే మాదిరిగా ఉందని ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ అమ్మాయి మరెవరో కాదు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కుమార్తె షోరా సిద్ధిఖీ
తాజాగా తన కూతురి ఆడిషన్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు నవాజుద్దీన్. అయితే తన పోస్టుకు #bollywood తోపాటు #hollywwod హ్యాష్‌ట్యాగ్ యాడ్ చేయడంతో షోరా హాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేస్తుందేమోనని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా 15 ఏళ్ల షోరా కొంతకాలంగా నటనలో శిక్షణ తీసుకుంటోంది.
ఇవి కూడా చదవండి
నవాజుద్దీన్ సిద్ధిఖీ కూతురు ఆడిషన్స్ వీడియో..
ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకంఉది షోరా. తండ్రితో కలిసి ఆమె గతేడాది ఓ వివాహ వేడుకకు హాజరైంది. అప్పటి ఫొటోలు కూడా క్షణాల్లోనే నెట్టింట వైరలయ్యాయి. చాలా మంది షోరాను దీపికా పదుకొణెతో పోల్చారు. ఇక నవాజుద్దీన్ సిద్దిఖీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన సైంధవ్ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చారు.
ఓ పెళ్లి వేడుకలో నవాజుద్దీన్ సిద్ధిఖీ గారాల పట్టి.. వీడియో
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .