గుండె ఆరోగ్యం నుండి జుట్టు దాకా.. వీటిని తినడం అస్సలు మిస్ అవ్వకండి..!

గుండె ఆరోగ్యం నుండి జుట్టు దాకా.. వీటిని తినడం అస్సలు మిస్ అవ్వకండి..!


కరివేపాకు మన వంటకాల్లో కేవలం సువాసన కోసం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. వీటిలో విటమిన్లు A, B, C, E, K.. అలాగే ఐరన్, కాపర్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్ వంటి ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి సంపూర్ణ పోషణను అందిస్తాయి. కరివేపాకుతో కలిగే అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • హార్ట్ హెల్త్‌.. కరివేపాకు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గే ఛాన్స్ ఉంది. ఇది గుండెను హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.
  • జీర్ణశక్తి.. ఈ ఆకుల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా.. పచ్చి ఆహారానికి సహాయకంగా ఉంటుంది.
  • ఇమ్యూనిటీ బూస్ట్.. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ కల్పించి వ్యాధులపై పోరాడే శక్తిని పెంచుతాయి.
  • కళ్ళకు రక్షణ.. విటమిన్ A సమృద్ధిగా ఉండే కరివేపాకు కళ్లకు మేలు చేస్తుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చూపు బలంగా మారుతుంది.
  • రక్తహీనతకు చెక్.. ఈ ఆకుల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉండటంతో రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
  • లంగ్స్ హెల్త్‌కు బెటర్.. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన కరివేపాకు శ్వాసవ్యవస్థకు బలాన్నిస్తుంది. శ్వాస సంబంధిత ఇబ్బందులు తగ్గుతాయి.
  • వెయిట్ లాస్ ఫ్రెండ్లీ.. కరివేపాకు తక్కువ క్యాలరీలతో ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారి ఆహారంలో చేర్చడానికి చాలా మంచిది.
  • హెయిర్ హెల్త్‌కు బెస్ట్.. బీటాకెరోటిన్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఈ ఆకులు జుట్టును బలంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • స్కిన్‌ గ్లో.. కరివేపాకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి కొత్త మెరుపును ఇస్తాయి. ముడతలు, పింపుల్స్ వంటి సమస్యలను తగ్గించగలవు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *