ఉపవాసం రోజు ఎనర్జీ కోసం.. 7 డిఫరెంట్ స్టైల్స్ సబుదానా ఖిచ్డీ రెసిపీలు..!

ఉపవాసం రోజు ఎనర్జీ కోసం.. 7 డిఫరెంట్ స్టైల్స్ సబుదానా ఖిచ్డీ రెసిపీలు..!


ఉపవాసాల టైమ్‌ లో తేలికగా డైజెస్ట్ అయ్యే.. ఎనర్జీ ఇచ్చే ఫుడ్ కావాలంటే సబుదానా ఖిచ్డీ ఒక సూపర్ ఆప్షన్. ఇది శ్రావణం, నవరాత్రి వంటి పవిత్ర దినాల్లో చాలా మందికి ఫేవరెట్ ఉపవాస భోజనం. ప్రాసెస్ కూడా సింపుల్‌ గానే ఉంటుంది. కానీ కొద్దిగా మార్పులు చేస్తే ఈ టపియోకా పూసలతో (tapioca pearls) చేసే ఖిచ్డీకి కొత్త రుచి, ఆకర్షణ యాడ్ అవుతాయి. ఇప్పుడు మనం 7 రకాల రుచికరమైన సబుదానా ఖిచ్డీల గురించి వివరంగా తెలుసుకుందాం.

మహారాష్ట్ర స్టైల్ సబుదానా

ఇది సబుదానా ఖిచ్డీలో అత్యంత పాపులర్ పద్ధతి. రాత్రంతా నీటిలో నానబెట్టి సబుదానాను వడగట్టి.. వేపిన శెనగలు, జీలకర్ర, పచ్చి మిరపకాయలు, ఉడికించిన ఆలుగడ్డలతో కలిపి వండుతారు. చివరగా నిమ్మరసం, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రుచిగా ఉంటుంది. వ్రతాల్లో ఇష్టంగా తినే డిష్ ఇదే.

డ్రైఫ్రూట్స్ సబుదానా

ఉపవాసం రోజుల్లో స్పెషల్‌ గా, పండుగ వైబ్‌లో తినేందుకు ఈ వెర్షన్ పర్ఫెక్ట్. నెయ్యిలో సబుదానా వేపి దానిలో బాదం, జీడిపప్పు, ద్రాక్ష వంటివి కలిపితే కొద్దిగా తీపి రుచితో పాటు టేస్ట్, పోషక విలువ రెండూ పెరుగుతాయి.

చల్లటి సబుదానా

వేసవిలో వచ్చే వ్రతాలకు.. శరీరాన్ని చల్లగా ఉంచి రిఫ్రెష్ చేసే వెర్షన్ ఇది. నానబెట్టిన సగ్గు బియ్యాన్ని.. కొద్దిగా పెరుగు, జీలకర్ర పొడి, రాక్ సాల్ట్ తో కలిపి చల్లగా వడ్డించవచ్చు. ఇది టేస్టీగా ఉండే సబుదానా రాయితాలా ఉంటుంది.

మసాలా సబుదానా

స్పైసీ ఇష్టపడే వారి కోసం ఇది బెస్ట్ వేరియేషన్. నెయ్యిలో అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి వేయించి.. అందులో సబుదానా కలిపితే హాట్‌ గా తినేందుకు తయారవుతుంది. జీర్ణక్రియకు మంచిది.

సౌత్ ఇండియన్ సబుదానా ఉప్మా

దక్షిణ భారత వంటక టచ్ కావాలంటే.. నెయ్యిలో ఆవాలు, కరివేపాకు (వ్రత నియమాలకు అనుకూలంగా ఉంటే) తురిమిన కొబ్బరి వేసి తాలింపు చేసి అందులో సబుదానా కలపాలి. కొత్తిమీర, నిమ్మరసం జత చేస్తే దక్షిణాది ఉప్మా మాదిరిగా రుచిస్తుంది.

చిలగడదుంప సబుదానా

నార్మల్ ఆలుగడ్డ బదులు బాయిల్డ్ స్వీట్ పొటాటో (చిలగడదుంప) ముక్కలతో తయారు చేస్తే మితమైన తీపి రుచి వస్తుంది. ఇది ఫైబర్ ఎక్కువగా ఉండే కారణంగా డైటింగ్ చేస్తున్న వారికి.. బాడీకి శక్తినిచ్చే వ్రత భోజనంగా బాగుంటుంది.

ప్రోటీన్ రిచ్ సబుదానా

ప్రోటీన్‌ను మరింతగా పొందాలంటే రాజగిరా పిండిని (Rajagira Flour) సబుదానాతో కలిపి తయారు చేయవచ్చు. ఇది నట్‌ లా టెక్స్చర్‌ ను ఇస్తుంది. పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. పూర్తిస్థాయి ఉపవాస దినాల్లో ఇది మంచి ఎనర్జీని ఇవ్వగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

సబుదానా జిగురుగా మారకుండా.. ఫ్లఫీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

  • సబుదానాను 5 నుంచి 6 గంటల పాటు లేదా రాత్రంతా తక్కువ నీటిలో నానబెట్టాలి (నీరు దాని ఎత్తుకి సమానంగా ఉండాలి).
  • వండే ముందు రెండు మూడు సార్లు నీళ్లలో కడగాలి.. స్టార్చ్ తొలగిపోతుంది.
  • పూర్తిగా నీరు తీసేసి వాడితే జిగురుగా మారదు.
  • పొడిగా ఉండేందుకు వేపిన శెనగపప్పును చక్కగా కలిపితే రుచి కూడా మెరుగుపడుతుంది.

ఈ ఉపవాసాల టైమ్‌ లో రుచిని, ఆరోగ్యాన్ని రెండింటినిచ్చే సగ్గుబియ్యం కిచిడీని ఈ రకంగా ఒకసారి ట్రై చేయండి. ఒక్కో రకంలోనూ కొత్త టేస్ట్.. అలాగే ఎనర్జీ ఇచ్చే పోషకాలు ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *