బిగ్ బాస్ సీజన్ 9 కు సర్వం సిద్ధమైంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది. దాంతో ఈ సారి హౌస్ లోకి ఎవరు వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే విజయవంతంగా 8 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు ఇప్పుడు సీజన్ 9కి కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు టీమ్. లిస్ట్ కూడా ఫైనల్ అయ్యిందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే సీరియల్ నటులు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఓ క్రేజీ సీరియల్ నటి హౌస్ లోకి అడుగుపెడుతుందని టాక్ వినిపిస్తుంది.
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్‌లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!
ఆమె ఎవరో కాదు బ్రహ్మముడి కావ్య.. సీరియల్స్ లో బెస్ట్ సీరియల్ గా నిలిచిన వాటిలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి. ఈ ధారావాహికకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ లో నటించిన నటీనటులు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నటించారు. వారిలో కావ్య అలియాస్ దీపిక రంగరాజు ఒకరు.
ఇది కూడా చదవండి : Jabardasth: నాకోసం పెళ్లి పీటలమీదనుంచి వచ్చేసేది.. లవ్ స్టోరీ బయట పెట్టిన జబర్దస్త్ నరేష్..
తెలుగు బుల్లితెరపై వంటలక్క తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నది ఈ అమ్మడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పేరుకు తమిళ నటి అయినప్పటికీ పక్కింటమ్మాయిలా తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది దీపిక. ఇక టీవీషోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్లలో వచ్చిరానీ తెలుగుతో దీపిక చేసే సందడి మాములుగా ఉండదు. ఇప్పుడు ఈ చిన్నదిబిగ్ బాస్ హౌస్ కు వెళ్లాలని ఉందని తెలిపింది. తనకు బిగ్ బాస్ హౌస్‌లో అవకాశం ఇవ్వాలని కోరుతోంది. తమిళ అమ్మాయి అయిన దీపికా రంగరాజు తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపికా చాలా మంది నన్ను బిగ్ బాస్‌కి వెళ్తారా అని అడుగుతున్నారు. ప్రస్తుతం నేను బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నా కాబట్టి వెళ్ళలేను. సీరియల్ కంప్లీట్ అయితే వెళ్తా.. ఇప్పటివరకు నాకు కాల్ రాలేదు. ఒకవేళ వస్తే వెళ్తాను. బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం.. ఒకవేళ వెళ్తే విన్నర్ టైటిల్ గెలవాలి, నాగార్జున గారు నా చేయి పైకెత్తి విన్నర్ అని చెప్పాలి అంటూ చెప్పుకొచ్చింది దీపికా.
ఇది కూడా చదవండి : బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు గురూ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.