పట్ట పగలు రాత్రిగా మారి ప్రపంచం మొత్తం చీకటిగా మారిపోతే మీకు ఎలా అనిపిస్తుంది..? అది కూడా పూర్తిగా 6 నిమిషాల పాటు.. ఇది కొంత అసౌకర్యంగా అనిపించడం సహజం. అలాంటి సంఘటన ఆగస్టు 2న జరగబోతుంది. వంద సంవత్సరాల తర్వాత ఇలాంటి అద్భుత సంఘటన ఆవిష్కృతం కానుంది. ఆగస్టు 2న పగలు రాత్రిగా మారుతుందని, సూర్యుడు 6 నిమిషాల పాటు అదృశ్యమవుతాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 100 సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన దృశ్యం కనిపించనుందని చెబుతున్నారు. అది ఎందుకు..? ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..
అవును, మీరు చదివింది నిజమే.. ఇదేదో ఊహాత్మక విషయం కాదు.. మరో రెండేళ్లలో ప్రపంచం అరుదైన ఖగోళ దృశ్యానికి సాక్ష్యంగా మారనుంది. ఆగస్టు2న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. 2027లో జరగనున్న ఈ సూర్యగ్రహణం ఈ శతాబ్దంలోనే అత్యంత దీర్ఘకాల సూర్యగ్రహణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంపూర్ణ సూర్యగ్రహణం కారణంగా పగటిపూట మొత్తం ఆకాశం చీకటిగా కనిపిస్తుందని పేర్కొన్నారు. గ్రేట్ నార్త్ ఆఫ్రికన్ ఎక్లిప్స్ అనే పేరుతో ఈ సూర్యగ్రహణం గుర్తింపు పొందనుంది.
ఇక రాబోయే వంద సంవత్సరాల వరకు అలాంటి సూర్యగ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహణంలో చంద్రుడు సూర్యుని పూర్తిగా కప్పివేసి 6 నిమిషాల 23 సెకన్లపాటు భూమిపై చీకటిని నింపుతాడని అంటున్నారు. ప్రపంచంలోని వివిధ ఖండాలలో నివసిస్తున్న కోట్లాది మంది ప్రజలు ఈ దృశ్యాన్ని చూడగలరని అంటున్నారు. 2114 వరకు ఇలాంటి సూర్యగ్రహణం మళ్లీ కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..