మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వృత్తి, ఉద్యోగాలకు సంబంధించినంత వరకూ సమయం అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. స్వయం ఉపాధి, వ్యాపారాలు దిగ్విజయంగా సాగిపోతాయి. కుటుంబంలో కొన్ని శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ సభ్యుల మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆశలు వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయం పఠించడం వల్ల ప్రతి ప్రయత్నంలోనూ వ్యవహార జయం ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. లాభాలు, రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయానికి లోటుండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చాలావరకు అనుకూలంగా పురోగమిస్తాయి. ఆర్థిక లావాదేవీల జోలికి పోకపోవడం మంచిది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు, కార్యకలాపాలు పూర్తవుతాయి. పిల్లల వల్ల కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆస్తి వివాదాల విషయంలో శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తరచూ శివార్చన చేయడం వల్ల శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వారం రోజుల పాటు జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, శ్రమ నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. ఇతర రంగాలకు చెందిన వారు కూడా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొను గోలు చేస్తారు. ప్రతి నిత్యం సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒకటి రెండు వ్యక్తి గత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటు ఉండదు. ఆహార, విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన కార్యకలాపాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు, అవివాహితులు ఆశించిన శుభవార్తలు వింటారు. ఏ పని తలపెట్టినా సంతృప్తికరంగా పూర్తవుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తరచూ శివార్చన చేయించడం వల్ల మరిన్ని సానుకూల ఫలితాలకు అవకాశం ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. బాగా నష్టపోయే అవకాశం ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బాగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభదాయకంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఒక ప్రణాళిక ప్రకారం ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తి చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వ్యక్తి గత, ఆర్థిక సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థత బాగా వెలుగులోకి వస్తుంది. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇతర సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంతో కలిసి శుభ కార్యాలు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పిల్లలు ఆశించిన విధంగా వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఊహించని శుభ వార్తలు వింటారు. అనారోగ్యం నుంచి కొంత వరకూ ఉపశమనం లభిస్తుంది. తరచూ దుర్గా దేవిని అర్చించడం, సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల పాప గ్రహాల దోషం బాగా తగ్గిపోతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వారమంతా కొన్ని శుభ ఫలితాలు, శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో ఆద రణ, ప్రోత్సాహాలకు లోటుండకపోవచ్చు. అధికారులు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ నిర్ణయాలు, మీ ఆలోచనలు కార్యరూపంలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో భారీగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయపరంగా ప్రతి ప్రయత్నం అనుకూలిస్తుంది. జీవిత భాగ స్వామికి కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం చాలావరకు బాగానే ఉంటుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విష్ణు సహస్ర నామ పఠనం వల్ల కొన్ని దోషాలు తొలగిపోతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన లేదా కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలు నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయానికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం చేసినా సఫలం అవుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు పెంచడానికి అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించడం అవసరం. రోజూ ఉదయం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఒకటి రెండు ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ఆర్థిక లాభాల కోసం కాస్తంత ఎక్కువగా శ్రమపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రయోజనాలు ఇస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారా లలో లాభాలకు ఢోకా ఉండదు. అనుకోని కుటుంబ ఖర్చులతో ఇబ్బంది పడతారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. తరచూ గణపతి స్తోత్రం చదువుకోవడం వల్ల ఆటంకాలను సునాయాసంగా అధిగమిస్తారు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ రాశివారికి వారమంతా చాలా బాగుంటుంది. ఏ రంగంలో ఉన్నవారైనా విజయాలు, సాఫల్యాలతో పురోగతి చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి మీ ప్రయత్నాలు చాలావరకు మంచి ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. ఇంటా బయటా మీ మాట చెల్లుబాటు అవుతుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సుందరకాండ పారాయణం చేయడం వల్ల జీవితం మరింత మెరుగ్గా ఉంటుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. పదోన్నతి, జీతభత్యాల విషయంలో కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశీయానానికి అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. రావలసిన సొమ్మును పట్టుదలగా రాబట్టు కుంటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. దుర్గాదేవి స్తోత్రం పారాయణ చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఏలిన్నాటి శని కారణంగా మధ్య మధ్య ప్రతి పనిలోనూ ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులు అలవికాని లక్ష్యాలను అప్పగించే అవకాశం కూడా ఉంది. ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి ప్రయత్నించేందుకు ఇది మంచి సమయం. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. లలితా సహస్ర నామం పఠించడం వల్ల విజయాలు సిద్ధిస్తాయి.