సినిమాల్లో పాత్రల కోసం నటీ నటులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎలాంటి పాత్ర చేయడానికైనా సరే హీరోయిన్స్ కూడా రెడీ అవుతున్నారు. పాత్రకు తగ్గట్టుగా కొంతమంది హీరోయిన్స్ బరువు పెరుగుతారు. మరికొంతమంది స్లిమ్ గా మారిపోతుంటారు. ఇంకొంతమంది హీరోయిన్స్ ఊహించని విధంగా బరువు పెరుగుతూ ఉంటారు. ఇదిలా ఉంటే కొంతమంది హీరోయిన్స్ సినిమాల్లోకి రాక ముందు బొద్దుగా ఉంటారు. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోతూ ఉంటారు. మనం మాట్లాడుకునే ఓ హీరోయిన్ సినిమాల్లోకి రాక ముందు ఏకంగా 96 కేజీల బరువు ఉండేది. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె సన్నజాజిలా మారిపోయింది. జీరో సైజ్ లో అదరగొడుతుంది.
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం రచ్చ.. బోల్డ్ సీన్స్ అరాచకంతో థియేటర్స్లో బ్యాన్.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే.!
ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ అమ్మడు గతంలో తాను ఏకంగా 96 కేజీల వరుకు బరువు ఉండేదాన్ని అని తెలిపింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ సారా అలీఖాన్. బాలీవుడ్ లో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఓ క్రేజీ హీరోయిన్. ఈ యంగ్ బ్యూటీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అందంతో పాటు నటనతోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్ లోనూ సినిమాలు చేయాలని ట్రై చేస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : Jabardasth: నాకోసం పెళ్లి పీటలమీదనుంచి వచ్చేసేది.. లవ్ స్టోరీ బయట పెట్టిన జబర్దస్త్ నరేష్..
కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సారా అలీఖాన్ మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు నేను దాదాపు 96 కిలోల బరువు ఉండేదని అని తెలిపింది. అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు పీసీఓడీ (PCOD) సమస్య ఉండేదని, దాని వల్ల విపరీతంగా బరువు పెరిగాను అని తెలిపింది. సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి బరువు తగ్గించుకున్నా అని తెలిపింది. ఇప్పుడు ఈ భామ సన్నజాజి నడుముతో తన వయ్యారాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది.
ఇది కూడా చదవండి : బాల రామాయణం సీతమ్మ.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు గురూ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.