Chandra Mangala Yoga: చంద్ర, కుజుల యుతి.. అయిదు రాశులకు అదృష్ట యోగం..!

Chandra Mangala Yoga: చంద్ర, కుజుల యుతి.. అయిదు రాశులకు అదృష్ట యోగం..!


ఈ నెల 14, 15, 16 తేదీల్లో కర్కాటక రాశిలో చంద్ర, కుజుల యుతి జరగబోతోంది. కర్కాటక రాశి చంద్రుడికి స్వక్షేత్రం కాగా, కర్కాటకంలో కుజుడు నీచ పొందడం జరుగుతుంది. అయితే, నీచ క్షేత్రంలో కుజుడు వక్రించడం వల్ల నీచభంగం కలిగింది. ఈ రెండు గ్రహాలు ప్రాణ స్నేహితులు. ఈ రెండు గ్రహాల కలయికను చంద్ర మంగళ యోగంగా జ్యోతిషశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇది ఒక ఆదాయ వృద్ధి యోగం. ఈ మూడు రోజుల కాలంలో ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేప ట్టినా విజయవంతం అవుతుంది. వడ్డీ వ్యాపారాలు, షేర్ల కొనుగోలు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు ప్రారంభించడానికి ఇది అత్యంత యోగదాయకమైన కాలం. మేషం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఈ యోగం ఊహించని అదృష్టాలను తెచ్చిపెడుతుంది.

  1. మేషం: రాశ్యధిపతి కుజుడు చతుర్థంలో చంద్రుడితో కలవడం వల్ల ఈ రాశివారికి ఈ చంద్ర మంగళ యోగం కలిగింది. ఈ యోగం పట్టినప్పుడు వీరు ఎటువంటి ఆదాయ ప్రయత్నం చేపట్టినా సమీప భవిష్యత్తులో తప్పకుండా నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. విలువైన భూ లాభం, ఆస్తి లాభం కలుగుతాయి. ఉద్యోగంలో వేతనాలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశిలో చంద్ర మంగళ యోగం ఏర్పడుతున్నందువల్ల ఉద్యోగంలో జీతభత్యాలు, అదనపు ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించుతుంది. తప్పకుండా ఆస్తి లాభం కలుగుతుంది. ఆస్తి సంబంధమైన వివాదాలు, సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు వంటివి లాభిస్తాయి. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.
  3. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు నవమ స్థానంలో భాగ్యాధిపతి చంద్రుడితో యుతి చెందుతున్నందువల్ల అనే విధాలుగా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వారసత్వ సంపద లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా జీత భత్యాలు పెరుగుతాయి. త్వరలో విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. కొద్ది ప్రయ త్నంతో ఆదాయ మార్గాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది.
  4. మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ, చంద్రుల యుతి జరుగుతున్నందువల్ల తప్పకుండా అనేక మార్గాల్లో ధన లాభాలు కలుగుతాయి. స్థిరాస్తులు సమకూరే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయం అవు తుంది. అనేక మార్గాల్లో సంపద పెరిగే అవకాశం ఉంది. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్ది ప్రయత్నంతో లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో వేతనాలు వృద్ధి చెందుతాయి.
  5. మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో చంద్ర మంగళ యోగం ఏర్పడుతున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు దాదాపు కనక వర్షం కురిపి స్తాయి. ఉద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన మరో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. మనసులోకి కోరికలు, ఆశలు కొన్ని నెరవేరుతాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *