దిన ఫలాలు (మే 16, 2025): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మిథున రాశి వారికి అనారోగ్య సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఉద్యోగంలో మీ పనితీరు పట్ల అధికారులు సంతృప్తి చెందుతారు. మీ సలహాలు, సూచనలు సంస్థకు ఉపయోగపడతాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు తగ్గించుకోవడం మీద దృష్టి పెట్టడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాలు బాగా పెరుగుతాయి. శరీరానికి తగినంత విశ్రాంతి ఉండకపోవచ్చు. ప్రయాణాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు పొందుతారు. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై ఊరట లభిస్తుంది. కుటుంబ జీవితం సుఖప్రదంగా సాగిపోతుంది. అనారోగ్య సమస్యలు కొద్దిగా పరిష్కారం అవుతాయి. గృహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిలకడగా ఉంటుంది. పిల్లల పరంగా శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటవుతుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేసే స్థాయిలో ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల మీద పైచేయి సాధిస్తారు. కార్యకలాపాలు బాగా వృద్ది చెందుతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. వాహన ప్రమాదాలతో జాగ్రత్తగా ఉండాలి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లబ్ధి పొందు తారు. డబ్బు ఇచ్చినా, తీసుకున్నా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. తోబుట్టువులతో ఆస్తి సమస్యలు పరిష్కారం కావచ్చు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ముఖ్యంగా పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా, నిలకడగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఉద్యోగ జీవితం సాదా సీదాగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు కొద్దిగా తగ్గేతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. సన్నిహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది. రావలసిన డబ్బు అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా, సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా పురోగమిస్తుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ పెద్దల జోక్యంతో ముఖ్యమైన ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో కార్యకలాపాలు పెరుగుతాయి. విశ్రాంతికి అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలసి విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో సహోద్యోగుల ఇతరుల బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఇతరుల పనుల కంటే సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. స్తోమతకు మించి బంధువులకు సహాయం చేయవలసి వస్తుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు లభిస్తాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.