Hyderabad: మంచి హోటల్‌, నోరూరించే మెనూ.. లోపల కిచెన్‌లోకి వెళ్తే..

Hyderabad: మంచి హోటల్‌, నోరూరించే మెనూ.. లోపల కిచెన్‌లోకి వెళ్తే..


హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా.. కొందరు కేటుగాళ్ల తీరు ఏమాత్రం మారడం లేదు. ఆహార తయారీలో ఇష్టారీతి పదార్థాలు, డేంజర్‌ కెమికల్స్‌ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు. కేసులు నమోదు అవుతున్నా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా అవేమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. ఆహార పదార్థాల కల్తీ.. తయారీలో డేంజర్‌ కెమికల్స్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తూనే ఉన్నారు.

తాజాగా.. లక్డీకపూల్‌, నారాయణగూడలో హోటల్స్‌, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి చేశారు. ఫుడ్‌ ఐటమ్స్‌లో హానికరమైన సింథటిక్‌ కలర్స్‌ వాడుతున్నట్లు గుర్తించారు. తుప్పుపట్టిన పాత్రల్లో ఆహార పదార్థాలు తయారుచేస్తున్నట్లు తేల్చారు. ఒకే ఫ్రిడ్జ్‌లో వెజ్‌, నాన్‌ వెజ్‌ను నిల్వ చేస్తుండడపై సీరియస్‌ అయ్యారు. అంతేకాదు కిచెన్‌లో అపరిశుభ్ర వాతావరణం, బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. ఎక్స్‌పైరీ అయిన ఫుడ్‌ ప్రొడక్స్‌ని వాడుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ… హోటల్‌ అశోక్‌, ఇండియన్‌ దర్బార్‌ సహా పలు రెస్టారెంట్లకు నోటీసులిచ్చారు.

అలాగే FSSAI నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్ధాలను విక్రయిస్తున్న హోటల్స్‌ను సీజ్‌ చేశారు. ఫుడ్‌ ఐటమ్స్‌లో కెమికల్స్‌ వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు. మొత్తంగా.. హైదరాబాద్‌లో వరుస ఫుడ్‌ సేఫ్టీ దాడులు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేవారి గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *