ఇంగ్లాండ్ – టీమిండియా మధ్య నాల్గవ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరగనుంది. ఈ సిరీస్‌లో రెండు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. శుభ్‌మాన్ గిల్ జట్టు టెస్ట్ సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే.. మాంచెస్టర్ టెస్ట్ గెలవడం చాలా ముఖ్యం. ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిస్తే, సిరీస్ ఆతిథ్య జట్టుకే వెళ్తుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉండడం ఆందోళన కలిగిస్తుంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం పడుతుందని నివేదికలు వస్తున్నాయి.
మాంచెస్టర్‌లో వాతావరణం ఎలా ఉంటుంది?
అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. జూలై 23న వర్షం పడే అవకాశం 25 శాతం ఉంది. బుధవారమే మ్యాచ్ ప్రారంభమవుతుంది. జూలై 24న కూడా వర్షం పడే అవకాశం 25 శాతం ఉంది. జూలై 25 శుక్రవారం నాడు వర్షం పడే అవకాశం 50 శాతం ఉంది. మ్యాచ్ యొక్క నాల్గవ రోజు అంటే జూలై 26న వర్షం పడే అవకాశం 25 శాతం ఉంది. జూలై 27న వర్షం పడే అవకాశం 58 శాతం ఉంది. అంటే వర్షం మ్యాచ్‌ను ఐదు రోజులూ అంతరాయం కలిగించవచ్చు. ఇది మ్యాచ్‌ను కూడా ప్రభావితం చేస్తుంది.
పిచ్ ఎలా ఉంటుంది?
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో పిచ్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. ప్రారంభంలో, ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుంది. అయితే బ్యాట్స్‌మన్ సెట్ అయితే మంచి స్కోర్ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. స్పిన్నర్కు మ్యాచ్ యొక్క మూడవ రోజు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. మ్యాచ్ చివరి రోజు బౌలర్లకు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అప్పుడు బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. ఇక్కడ టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం అంత తేలికైన పని కాదు.
ఒక్క మ్యాచ్ గెలవని భారత్..
టీమిండియా ఇప్పటివరకు ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో 9 టెస్టులు ఆడింది. కానీ ఒక్కటి కూడా గెలవలేదు. 4 మ్యాచ్‌లను కోల్పోయి 5 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. ఈ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో నలుగురు భారత బౌలర్లు ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశారు. వారిలో లాలా అమర్‌నాథ్, వినూ మన్కడ్, సురేంద్రనాథ్, దిలీప్ దోషి ఉన్నారు. కానీ 1982 నుండి ఏ భారతీయ బౌలర్ ఇక్కడ 5 వికెట్లు తీయలేకపోయాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..