లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో.. టీమిండియా ఓటమి చవిచూసింది. చివరి వరకు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ పరాజయం టీమిండియాకు డబ్ల్యూటీసీ పాయింట్ల ఈ ఓటమి జట్టుకు ఎదురుదెబ్బగా మారడమే కాకుండా, 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ( WTC ) పాయింట్ల పట్టికలో పెద్ద మార్పును తెచ్చిపెట్టింది. ఇంగ్లాండ్ తన స్థానాన్ని మెరుగుపరుచుకోగా.. భారత్ దిగజారింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గెలవడానికి 193 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ నిర్దేశించగా.. కేవలం 170 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. దీని ప్రభావం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికపై పడింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 36 పాయింట్లు, 100 విజయశాతం సాధించిన ఆస్ట్రేలియా WTC ప్రస్తుత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అలాగే ఇంగ్లాండ్ జట్టు లార్డ్స్ టెస్ట్ విజయంతో రెండవ స్థానానికి చేరుకుంది. తద్వారా ఇంగ్లాండ్‌కు 24 పాయింట్లు, 66.67 విజయశాతం లభించింది. మరోవైపు శ్రీలంక కూడా 66.67 విజయశాతం, 16 పాయింట్లతో మూడోస్థానంలో ఉంది. ఇక టీమిండియా ఆడిన 3 మ్యాచ్‌లలో ఒకటి గెలిచి, రెండింట ఓడిపోయి 33.33 విజయశాతం, 12 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి.
చివరి వికెట్ వరకు టీమిండియా..
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన లార్డ్స్ టెస్ట్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది. అంతేకాకుండా టీమిండియా కూడా తన తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు కొట్టింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులు చేయగా.. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..