IND vs PAK: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 టోర్నమెంట్ నిర్వాహకులు ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అందులో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయిందని స్పష్టం చేశారు. భారత ఆటగాళ్లు పాకిస్థాన్‌తో ఆడటానికి నిరాకరించడంతో, ఈ నిర్ణయం తీసుకోవడం తప్పనిసరైందని డబ్ల్యూసీఎల్ వెల్లడించింది. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలోని ఇండియా ఛాంపియన్స్ తదుపరి మ్యాచ్ జూలై 22న సౌత్ ఆఫ్రికాతో జరగనుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ నిర్వాహకులు తమ అధికారిక ప్రకటనలో భారత ఆటగాళ్లకు, అభిమానులకు తాము తెలియకుండానే వారి మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పారు. కేవలం అభిమానులకు మంచి క్షణాలు అందించాలనే తమ ఉద్దేశమని వారు తెలిపారు.
డబ్ల్యూసీఎల్ ప్రకటనలో.. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఎల్లప్పుడూ క్రికెట్‌కు ప్రాధాన్యతనిచ్చి, దాన్ని ప్రేమించింది. మా ఏకైక లక్ష్యం అభిమానులకు సంతోషకరమైన క్షణాలను అందించడం. ఈ సంవత్సరం పాకిస్థాన్ హాకీ జట్టు భారత్‌కు వస్తుందని మేము విన్నాము, ఇటీవల భారత్, పాకిస్థాన్ మధ్య వాలీబాల్ , మరికొన్ని ఇతర క్రీడలు జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కొన్ని మంచి జ్ఞాపకాలను సృష్టించడానికి మేము డబ్ల్యూసీఎల్‌లో కూడా ఈ మ్యాచ్‌ను కొనసాగించాలని అనుకున్నాము.”
Dear all , pic.twitter.com/ViIlA3ZrLl
— World Championship Of Legends (@WclLeague) July 19, 2025
అయితే, దీని వల్ల మేము చాలా మంది మనోభావాలను దెబ్బతీశాయని మాకు అర్థమైంది. దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన భారత క్రికెట్ దిగ్గజాలకు మేము తెలియకుండానే అసౌకర్యం కలిగించాం. బ్రాండ్‌లపైనా ప్రభావం చూపింది. ఈ కారణంగానే మేము భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాము. మనోభావాలను దెబ్బతీసినందుకు మరోసారి క్షమాపణలు కోరుతున్నాము. ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. మేము కేవలం అభిమానులకు కొన్ని సంతోషకరమైన క్షణాలను అందించాలనుకున్నాం” అని తెలిపారు.
ఇండియా ఛాంపియన్స్ జట్టు:
యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, పియూష్ చావ్లా, స్టూవర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్ , వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్ధార్థ్ కౌల్, గుర్కీరత్ మాన్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..