బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో కత్రీనా కైఫ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ హిందీలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉండే కత్రినా.. పెళ్లి తర్వాత అంతగా అడియన్స్ ముందుకు రావడం లేదు.
అయితే మొదటి నుంచి కత్రీనా నటనపై చాలా విమర్శలు వస్తుంటాయి. సినిమా రంగంలో రెండు దశాబ్దాలు గడిపిన కత్రీనా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆమె యాక్టింగ్ పై విమర్శలు వచ్చాయి.
ఎన్ని విమర్శలు, ట్రోల్స్ వచ్చినా తన కష్టాన్ని నమ్ముకొని సక్సెస్ అయ్యింది కత్రినా..2003లో కత్రినా కైఫ్ ‘బూమ్’ అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ అందాల తార. తెలుగులో వెంకటేష్ మల్లీశ్వరి సినిమా తర్వాత బాలకృష్ణతో అల్లరి పిడుగు సినిమా చేసింది.. ఆతర్వాత తెలుగు సినిమాల్లో నటించలేదు కత్రీనా కైఫ్.
కత్రినా కైఫ్ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘న్యూయార్క్’ (2009), ‘నమస్తే లండన్’ (2007), ‘మేరే బ్రదర్ కి దుల్హన్’ (2011), ‘అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ’ (2009), ‘రాజనీతి’ (2010), ‘ధూమ్ 3’, ‘జిందగీ నా మిలేగి దొబారా’ (2011), ‘ఏక్ థా టైగర్’ (2012) వంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లు సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది.
ఫోర్బ్స్ ఇండియా 2019లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో కత్రినా కూడా ఉంది. ఆమె ఆస్తులు 263 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. ఒక్కో సినిమాకి 12 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది కత్రినా. అలాగే పలు వాణిజ్య సంస్థలకు బబ్రాండ్ అంబాసిడర్గాను ఉంది ఈ చిన్నది.