సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నభా నటేష్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నభా షేర్ చేసిన సారీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
పింక్ సారీలో వయ్యారాలతో మతిపోగొట్టేలా కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. చీరకట్టులో కుర్రాళ్లకు మెంటలెక్కిస్తోంది ఈ అమ్మడు. ప్రస్తుతం నభా షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నభా. మొదటి చిత్రంతోనే యూత్ అడియన్స్ మనసు దోచుకుంది. గ్లామర్, యాక్టింగ్ పరంగా వెండితెరపై మాయ చేసింది నభా.
ఆ తర్వాత రామ్ పోతినేని సరసన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాతో నభా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో నభా పేరు మారుమోగింది.
ఆ తర్వాత యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరమైన నభా.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే డార్లింగ్ సినిమాతో ్లరించిన ఈ అమ్మడు.. ఇప్పుడు నిఖిల్ నటిస్తోన్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది.