
PM Modi: నిజాయితీ, నిరాడంబర, సరళతకు ప్రతిబింబం.. మన్మోహన్ సింగ్‌ను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ
దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయనకు నివాళులర్పించేందుకు దేశవ్యాప్తంగా పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి తరలివస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. మోదీ మంత్రివర్గంలో కూడా ఆయనకు నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అని ప్రధాని మోదీ అన్నారు. ఒక వ్యక్తి లేమిని అధిగమించి, పోరాడి విజయాన్ని ఎలా సాధించవచ్చో డాక్టర్ మన్మోహన్…