
పై ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. హైదరాబాద్ లో నే పుట్టి పెరిగింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేస్తూ తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటివరకు సుమారు పదికి పైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కొన్నింటిలో హీరోయిన్ గానూ, మరికొన్నింటిలో సెకెండ్ లీడ్ గానూ ఆకట్టుకుంది. అయితే చాలా మంది లాగే సినిమాల్లోకి రాకముందు ఈ అందాల తార కూడా పలు టీవీ షోస్ లో పాల్గొంది. యాంకర్ గానూ సత్తా చాటింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు పోషించింది. అయితే 2018లో ప్రతిష్ఠాత్మక మిస్ హైదరాబాద్ టైటిల్ గెల్చుకుందీ అందాల తార. దీంతో ఈ అమ్మడికి సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతోన్న ఈ ముద్దుగుమ్మను ఎవరో గుర్తు పట్టారా? తన మరెవరో కాదు గౌరి ప్రియ.
గౌరి ప్రియ చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ పై బాగా ఇంట్రెస్ట్ గా ఉండేది. స్కూల్, కాలేజీ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంది. అలా బోల్ బేబీ బోల్ ప్రోగ్రాంలో రెండవ సీజన్ లో రెండవ స్థానంలో, మూడవ సీజన్ లో మొదటి స్థానంలో నిలిచిందీ అందాల తార. ఆ తర్వాత ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ నిర్వహించిన యూత్ సింగింగ్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచింది. కొంతకాలం జెమినీ టీవీలో యాంకర్ గా పని చేసింది కూడా. అలాగే నిర్మలా కాన్వెంట్, మనలో ఒకడు, ఫిదా సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించింది. అయితే 2018లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెలిచిన తర్వాత ఈ అమ్మడికి సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి.
గౌరి ప్రియ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
2021లో మెయిల్ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది గౌరి ప్రియ. ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ సినిమాలతో ఆడియెన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. లవ్ స్టోరీ, మోడరన్ లవ్ చెన్నై (వెబ్ సిరీస్), ట్రూ లవర్ సినిమాల్లోనూ తళుక్కుమంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ, వింటారా సరదాగా సినిమాలతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..