HYDRA: గ్యాప్ తీసుకోలేదు.. అలా వచ్చిందంతే.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్.. మళ్లీ రంగంలోకి..
అక్రమణలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా.. కాస్త విరామం ఇచ్చింది. అతి త్వరలో అంతకుమించి అనేలా యాక్షన్ షురూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా మియాపూర్ స్టాలిన్‌నగర్‌లోని సర్వే నంబర్ 100, 101లపై దృష్టి సారించింది. ఈ సర్వే నంబర్లలో దాదాపు 550 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వంద ఎకరాలకు పైగా భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇప్పుడా భూములపైనే ఆరాతీస్తోంది హైడ్రా. ఉమ్మడి రాష్ట్రంలో మియాపూర్ భూముల్ని వేలం వేసేందుకు అప్పటి ప్రభుత్వాలు ప్రతిపాదించాయి. అయితే సుప్రీంకోర్టులో కేసులు…