చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది చికెన్, మటన్ కంటే చేపలనే ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారు. శరీరానికి అవసరం అయ్యే పోషకాలు మనకు చేపల్లో లభిస్తాయి. చేపలలో ఎక్కువగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి.
అందుకే వారంలో ఒక్కసారైనా చేపలు తినాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే చేపలు ఏవి చూసినా ఒకలానే ఉంటాయి. అందులో అప్పుడే తాజాగా ఉండే చేపలు ఏవో.. పాడైపోయిన చేపలు ఏవో ఈజీగా కనిపెట్టవచ్చు.
ఇలాగే జనాల్ని మోసం చేసి కొంత మంది పాడైపోయిన చేపల్ని అమ్మేస్తూ ఉంటారు. వీటిని తిన్నా ఎలాంటి ఫలితం ఉండదు. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూఢా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సారి మీరు చేపల్ని కొనేటప్పుడు ఈ చిట్కాలు ఫాలో చేయండి.
చేపలు తాజాగా ఉన్నాయో లేదో వాటి కళ్లను బట్టి చెప్పొచ్చు. చేప కళ్లు చూడటానికి క్లియర్‌గా ఉంటే అవి ఫ్రెష్‌గా ఉన్న లేక మంచి చేపలు. చేప మెరిసేలా మంచి రంగును ఉన్నా తాజా చేపలే. చేపలు పట్టుకున్నప్పుడు గట్టిగా ఉంటే అది మంచి చేప అని చెప్పొచ్చు.
చేప కొనేటప్పుడు చేప కళ్ల కింద భాగం అందే స్కేల్ భాగాన్ని పరిశీలించాలి. ఇది గులాబీ రంగులో ఉండే అది ఫ్రెష్ చేప అని చెప్పొచ్చు. ఒక వేళ ఈ భాగం గడ్డ కట్టి ఉంటే మాత్రం అది పాడైపోయిన చేప. అదే విధంగా చేప నుంచి మరీ చెడు వాసన వస్తే అది నిల్వ ఉన్న చేపగా చెప్పొచ్చు. తాగా చేప అంత చెడు వాసన రాదు.