Olectra Green Tech: రెండో త్రైమాసిక ఫలితాల్లో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ రికార్డ్.. 156 శాతం పెరిగిన లాభాలు!

Olectra Green Tech: రెండో త్రైమాసిక ఫలితాల్లో ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ రికార్డ్.. 156 శాతం పెరిగిన లాభాలు!


రెండో త్రైమాసికం లాభాల్లో అదరగొట్టింది ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌. MEIL గ్రూప్‌లో భాగంగా ఉన్న ఈ సంస్థ ఏకంగా 156 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీలో అగ్రగామిగా ఉన్నా మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌(OGL) మ‌రో మైలురాయిని సొంతం చేసుకుంది. ప‌ర్యావ‌ర‌ణ‌హిత భవిష్యత్ ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు మ‌రింత చేరువ చేసేందుకు సిద్ధమైంది. వాణిజ్యపరంగా ఘనత సాధించింది. ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలు గడించినట్లు సంస్థ ప్రకటించింది.

ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసిక, అర్ధ-సంవత్సర ఏకీకృత ఆర్థిక ఫలితాలను సంస్థ ప్రకటించింది. ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 523.67 కోట్లు అంటే 70 శాతం పెరిగింది. త్రైమాసికంలో అధిక డెలివరీల ఫలితంగా ఈ గణనీయమైన ఆదాయ వృద్ధి నమోదు చేసింది. ఇదే సమయంలో కంపెనీ ఈ బిఐటిడిఏ ఆకట్టుకునే విధంగా రూ. 85.69 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 90 శాతం పెరుగుదలను సూచిస్తోంది. సోమవారం(అక్టోబర్ 21) జరిగిన సమావేశంలో డైరెక్టర్ల బోర్డు ఈ ఫలితాలను ఆమోదించింది. ఈ త్రైమాసికంలో ఒలెక్ట్రా కొత్తగా 315 ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేసింది. గత ఏడాది ఇదే సమయంలో 154 వాహనాలను డెలివరీ చేసింది. అంటే 105 శాతం పెరుగుదలను సాధించింది.

ఓలెక్ట్రా లాభం పన్నుల చెల్లింపులకు ముందు గత ఆర్థిక సంవత్సరం రూ. 26.57 కోట్లతో పోలిస్తే 144 శాతం పెరుగుదలతో రూ.64.83 కోట్లకు చేరుకుంది. పన్నుల చెల్లింపుల తరువాత లాభం రూ. 47.65 కోట్లుగా ఓలెక్ట్రా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 18.58 కోట్లతో పోలిస్తే, ఇది 156 శాతం పెరుగుదల నమోదు చేసింది.

ఒలెక్ట్రా అర్ధ సంవత్సరం పనితీరు

కంపెనీఈ ఆర్ధిక సంవత్సరం తోలి ఆరు నెలల్లో ఆదాయం రూ. 837.61 కోట్లు. ఇది 60 శాతం పెరుగుదలు సూచిస్తోంది. ఈ ఆరు నెలల్లో కంపెనీ ఈబిఐటిడిఏ ఆకట్టుకునే విధంగా రూ. 136.20 కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన 57 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. పన్నుల చెల్లింపునకు ముందు లాభం రూ. 96.68 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం రూ. 51.83 కోట్లతో పోలిస్తే ఇది 87 శాతం పెరుగుదల నమోదు చేసింది. పన్నుల చెల్లింపుల తరవాత లాభం గత ఆర్థిక సంవత్సరం రూ. 36.65 కోట్లతో పోలిస్తే 96 శాతం పెరిగి రూ.71.91 కోట్లుగా ఉంది.

ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికం..తొలి ఆరు నెలల్లోనే లాభాల్లో వృద్ధి సాధించటం పట్ల ఒలెక్ట్రా సీఎండీ కెవీ ప్రదీప్ సంతోషం వ్యక్తం చేశారు. ఉత్పత్తిని పెంచడం, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడంపై తమ దృష్టి కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆర్డర్ బుక్ బలంగా ఉందిని సీఎండీ ప్రదీప్ అన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ev మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నా ఒలెక్ట్రా స్థిరమైన రాబడితో పాటు మార్జిన్‌ వృద్ధి సాధించింది. బలమైన వ్యాపార పనితీరు ప్రదర్శించడం వల్లే ఇది సాధ్యమైంది. రాబోయే రోజుల్లోనూ ఇదే వృద్ధిని కొనసాగిస్తామనే కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇదిలావుంటే, రిలయన్స్‌ సంస్థ సాంకేతిక భాగస్వామ్యంతో హైడ్రోజన్ బస్సులను సైతం ఒలెక్ట్రా రూపొందించింది. ఏడాదిలోపు వాణిజ్యపరంగా ఈ బస్సుల ఉత్పత్తి ప్రారంభించింది ఒలెక్ట్రా.ఈ బస్సులో ఒక్కసారి హైడ్రోజన్‌ నింపితే 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఈ బస్సుల్లో హైడ్రోజన్‌ నింపేందుకు 15 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. 12 మీటర్ల పొడవుండే ఈ బస్సుల్లో 32 నుంచి 49 వరకు సీట్లు ఉంటాయి. ఈ బస్సులో మొత్తం 4 హైడ్రోజన్‌ సిలిండర్లు ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *