దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగనన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ నల్లకుంటలో భారీ కటౌట్‌ను గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేశారు. అంబర్‌పేట నియోజకవర్గంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి 40 ఫీట్ల భారీ కటౌట్‌కు గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతా రోహిత్ భారీ క్రేన్ సహాయంతో పాలాభిషేకం చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని నాయకులు కొరుకున్నట్లు తెలిపారు.