సిన్వర్ ఏరివేతతో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుంది అని ఆయన పేర్కొన్నారు. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశామని.. అయితే యుద్ధం మాత్రం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. బందీలను సురక్షితంగా తీసుకురావడమే తమ ధ్యేయమని తెలిపారు. ఇక ఎంత మాత్రం గాజాను హమాస్ నియంత్రించలేదని అన్నారు. అయితే, తమ నాయకుడి మరణంపై హమాస్ ఇంకా స్పందించలేదు. మరోవైపు కీలక నేతలంతా హతమైన వేళ.. సిన్వర్ మృతి హమాస్‌కు భారీ దెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు. దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్ పోలికలు ఉన్నాయని గుర్తించిన ఐడీఎఫ్… డీఎన్‌ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి హమాస్ నేత మరణాన్ని ధ్రువీకరించుకుంది. గాజా యుద్ధానికి కారణమైన అక్టోబరు 7 మారణహోమానికి సూత్రధారి సిన్వరేనని తొలి నుంచి ఇజ్రాయెల్ బలంగా విశ్వసిస్తోంది. గతేడాది ఇజ్రాయెల్ సరిహద్దులపై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది మృతి చెందారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లింది. ఇంకా హమాస్ దగ్గర 100 మంది బందీలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏడాదిగా సిన్వర్ కోసం గాజా సొరంగాల్లో ఐడీఎఫ్ వేట కొనసాగిస్తోంది. తనను ఇజ్రాయెల్ హతమార్చకుండా బందీల మధ్య సిన్వర్ తలదాచుకుంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు కూడా ఇటీవల పేర్కొన్నాయి. అయితే బుధవారం తాము నిర్వహించిన దాడిలో మృతి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు.. బందీల మధ్యలో లేరని ఐడీఎఫ్ వివరణ ఇచ్చింది. బందీలకు ఎలాంటి హాని జరగలేదని పేర్కొంది. హమాస్ అగ్రనేత మృతికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ఇజ్రాయెల్ పంచుకుంది.
గాజాపై యుద్దం ప్రారంభించినప్పుడే.. హమాస్ అగ్రనేతలందరినీ హతమారుస్తామని ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది. ఒకొక్కరిని వేటాడుతూ వచ్చింది. హమాస్ రాజకీయ వ్యవహారాల అధిపతి ఇస్మాయెల్ హనియెను ఇటీవల టెహ్రాన్‌లో హతమార్చింది. మరో నేత మహమ్మద్ డెయిఫ్‌నూ మట్టుబెట్టింది. కొన్ని నెలలుగా గాజాపై చేస్తున్న దాడుల్లో దాదాపు కీలక కమాండర్లందరినీ చంపేసింది. ఇటీవల బీరుట్‌లోని హెజ్‌బొల్లా కార్యాలయంపై వైమానిక దాడులు నిర్వహించి…ఆ సంస్థ అధినేత నస్రల్లాను హతమార్చి కలకలమే సృష్టించింది. ఇప్పుడు సిన్వర్ మృతితో శత్రుశేషం దాదాపు పూర్తయినట్లే. మరోవైపు ఉత్తరగాజాలో గురువారం అబూ హుస్సేన్ పాఠశాలపై ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో 15 మంది చనిపోయారు. ఇందులో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.