Hyderabad: దీపావళిపై పోలీసులు ఆంక్షలు విధించారా…? సర్క్యులేట్ అవుతున్న న్యూస్‌లో నిజమెంత..?
దీపావళి పండుగ అంటేనే పటాకులు పేలాల్సిందే. కాకరపుల్లలు, చిచ్చుబుడ్లు, భూచక్రాల నుంచి మొదలుపెట్టి.. థౌసెండ్ వాలాలు, లక్ష్మీబాంబులు ఇలా పేర్లు ఏవైనా.. మోత మోగిపోవాల్సిందే. ఇటు భూమి మీద పేల్చే బాంబులే కాదు.. ఆకాశానికి దూసుకెళ్లి మిరుమిట్లుగొలిపే పటాసులు కూడా పెద్ద ఎత్తున కాలుస్తుంటారు. ఎంత ఎక్కువ కాలిస్తే.. అంత ఎక్కువ పండుగను ఎంజాయ్ చేసినట్టు. పండుగ రోజే కాదు.. దీపావళి వస్తుందంటే నాలుగైదు రోజుల ముందు నుంచే పటాకులు పేలుతూనే ఉంటాయి. మళ్లీ కార్తీక పౌర్ణమి…