జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర : పార్ట్ 1 సినిమా సెప్టెంబర్ 27, 2024న భారీ అంచనాల మధ్య విడుదలైంది. హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ వద్ద అభిమానులు సినిమా విడుదల సందర్భంగా బాణాసంచా కాల్చడం వలన, ఎన్టీఆర్ భారీ కటౌట్‌కి అనుకోకుండా నిప్పంటుకుంది (devara cutout burning). ఈ సంఘటనతో థియేటర్ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది, అయితే ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు.
సినిమా పై ప్రాథమిక సమీక్షలు మిశ్రమంగా ఉన్నాయి. కొంతమంది ప్రేక్షకులు సినిమా గురించి అసంతృప్తిని వ్యక్తం చేయగా, ఇతరులు సినిమాని ప్రశంసించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానం వల్ల అభిమానుల మధ్య అశాంతి చోటుచేసుకుంది. దేవర: పార్ట్ 1 లో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు జాన్వీ కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అభిమానులు సినిమా విడుదల సందర్భంగా బాణాసంచా కాల్చడం వలన, ఎన్టీఆర్ భారీ కటౌట్‌కి అనుకోకుండా నిప్పంటుకుంది. సినిమా గురించి కొంతమంది fake news x లో post viral చేయగా, అభిమానుల మధ్య అశాంతి చోటుచేసుకుంది
Fans Burning NTR Cutout Outside Hyderabad Theatre after the Initial Poor Ratings & Bad Talk for the Movie #Devara ! pic.twitter.com/QGzykbUZfW
— Raees🚁 (@RaeesHere_) September 27, 2024
హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) అక్షాంశ్ యాదవ్ ఈ వదంతులను ఖండించారు మరియు ఎన్టీఆర్ జూనియర్ కటౌట్ దగ్గర అభిమానులు పటాకులు కాల్చడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. అగ్ని ప్రమాదం త్వరగా అదుపులోకి తెచ్చారు, సినిమా ప్రదర్శనలు షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.