Telangana: నిరుద్యోగులకు TGPSC పండుగలాంటి వార్త.. ఇది కదా కావాల్సింది
కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లపై క్లారిటీ ఇచ్చారు TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం. ఏప్రిల్ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కుండబద్దలు కొట్టారు. మార్చి 31 వ తేదీలోగా ఖాళీల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారాయన. ప్రభుత్వం ఇచ్చిన ఖాళీలపై కసరత్తు చేసి ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన 6 నెలల నుంచి 8 నెలల లోపే ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామన్నారు బుర్రా వెంకటేశం. TGPSC నియామకాల్లో…