ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా వచ్చే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్,యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఒకటి రెండుచోట్లు చిరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.