మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్ సైజ్ ఎస్ యూవీలలో హ్యుందాయ్ క్రెటా ఒకటి. దీన్ని 2015లో మొదటి సారిగా విడుదల చేశారు. అప్పటి నుంచి సుమారు 1.2 మిలియన్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది జనవరిలో హ్యుందాయ్ రెండో తరం మోడల్ ఫేస్ లిఫ్టెడ్ వెర్షన్ ను విడుదల చేసింది. దానిలో భాగంగా కొన్ని నవీకరణలు తీసుకువచ్చి, వాటికి కొన్ని కొత్త లక్షణాలను చేర్చింది. క్రెటా కార్ల శ్రేణికి మరింత విలువను జోడించడానికి ఈ చర్యలు తీసుకుంది.
హ్యుందాయ్ కొత్త కారు రెండు రకాల వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వాటికి ఈఎక్స్ (ఓ), ఎస్ ఎక్స్ ప్రీమియం అనే పేర్లు పెట్టారు. వీటిలో ఈఎక్స్ (ఓ) వేరియంట్ ను పనోరమిక్ సన్ రూఫ్, ఎల్ఈడీ రీడింగ్ లైట్లు తదితర ప్రీమియం లక్షణాలతో రూపొందించారు. మరోవైపు ఎస్ ఎక్స్ ప్రీమియం స్కూఫ్ట్ లెదర్ సీట్లు, ముందు వెంటిలేటర్ సీట్లు, 8- వే పవర్డ్ డ్రైవర్ సీట్లు, 8- స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్ తదితర ప్రత్యేకతలతో ఆకట్టుకుంటోంది. దీనిలోని టాప్ స్పెక్ ఎస్ ఎక్స్ (ఓ) వేరియంట్ లో ఇప్పుడు రెయిన్ సెన్సార్, వెనుక వైర్ లెస్ చార్జర్, స్కూఫ్ట్ సీట్లు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా హ్యుందాయ్ ఎస్ (ఓ) వేరియంట్ నుంచి మోషన్ సెన్సార్ తో కూడిన స్మార్ట్ కీని ప్రవేశపెట్టింది. ఈ లక్షణాలతో పాటు రంగుల విషయంలో స్వల్ప మార్పులు జరిగాయి. టైటాన్ గ్రే మ్యాట్, స్టార్రి నైట్ కలర్ ఎంపికలో కెట్రా వేరియంట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇంజిన్, శక్తి పరంగా కొత్త కారులో ఎలాంటి మార్పులు చేయలేదు. 1.5 లీటర్ పెట్రోలు 1497 సీసీ ఇంజిన్ నుంచి 113 బీహెచ్ పీ శక్తి, 143.8 ఎన్ ఎం గరిష్ట టార్క్ విడుదల అవుతుంది. అలాగే 1.5 లీటర్ టర్బో పెట్రోలు 1493 సీసీ ఇంజిన్ నుంచి 157 బీహెచ్ పీ శక్తి, 253 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఇక 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ నుంచి 114 బీహెచ్ పీ, 250 ఎన్ఎం టార్కు ఉత్పత్తి అవుతుంది.
ఇవి కూడా చదవండి
- క్రెటా 1.5 ఎంపీఐ ఎంటీ ఈఎక్స్ (ఓ) రూ.12,97,190, దీనిలోని ఐవీటీ ఈఎక్స్ (ఓ) రూ.14,37,190 పలుకుతున్నాయి.
- క్రెటా 1.5 సీఆర్డీఐ ఎంటీ ఈఎక్స్ (ఓ) ధర రూ.14,6,490, దీనిలోని ఏటీ ఈఎక్స్ (ఓ) ధర రూ.15,96,490గా ఉంది.
- క్రెటా 1.5 ఎంపీఐ ఎంటీ ఎస్ ఎక్స్ ప్రీమియం రూ.16,18,390, దీనిలోని ఎంటీ ఎస్ ఎక్స్ (ఓ) రూ.17,46,360గా నిర్దారణ చేశారు.
- క్రెటా 1.5 ఎంపీఐ ఐవీటీ ఎస్ ఎక్స్ ప్రీమియం కారు రూ.17,68,390, దీనిలోని సీఆర్డీఐ ఎంటీ ఎస్ ఎక్స్ ప్రీమియం రూ.17,76,690కి అందుబాటులో ఉన్నాయి.
- క్రెటా 1.5 ఎంపీఐ ఐవీటీ ఎస్ ఎక్స్ (ఓ) రూ.18,92,300, సీఆర్డీఐ ఎంటీ ఎస్ ఎక్స్ (ఓ) రూ.19,04,700 పలుకుతున్నాయి.
- క్రెటా సీఆర్డీఐ ఏటీ ఎస్ఎక్స్ (ఓ) రూ.19,99,900, టర్బో డీసీటీ ఎస్ఎక్స్(ఓ) రూ.20,18,900కి అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి