Baglamukhi Temple: దర్శనంతోనే కోర్టు కేసుల్లో విజయాన్ని అందించే అమ్మవారి ఆలయం.. ఎక్కడంటే..

Baglamukhi Temple: దర్శనంతోనే కోర్టు కేసుల్లో విజయాన్ని అందించే అమ్మవారి ఆలయం.. ఎక్కడంటే..


భారతదేశం దేశం విభిన్న మతాలు, సంస్కృతిల ఏకైక సంగమం. ఇక్కడ వేల సంవత్సరాల పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఇవి వాటి నిర్మాణ శైలికి మాత్రమే కాదు వాటి రహస్య చరిత్ర, అద్భుతాలకు కూడా ప్రసిద్ధి చెందాయి. శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయే ఇలాంటి ఎన్నో రహస్యాలు ఈ ఆలయాల్లో దాగి ఉన్నాయి. ఈ దేవాలయాలలో జరుగుతున్న అద్భుతమైన సంఘటనలు, అద్భుతాలు శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి. భారతదేశంలోని ఈ పురాతన దేవాలయాలు కేవలం మతపరమైన కేంద్రాలు మాత్రమే కాదు మన దేశ గొప్ప వారసత్వం సంపద, సంస్కృతికి చిహ్నాలు కూడా. హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న బగ్లాముఖి ఆలయం అటువంటి విశిష్ట దేవాలయం. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకతను తీసుకుని వచ్చాయి.

ఆలయానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన నమ్మకం

ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకునే అన్ని కష్టాలు తీరుతాయని, కోర్టులో నలుగుతున్న కోర్టు కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని ఒక నమ్మకం. ఎవరైనా కోర్టు కేసుల్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతుంటే బగ్లాముఖి ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం వలన కోర్టు కేసులు త్వరగా పరిష్కారమవుతాయని ఈ ఆలయం గురించి చెబుతారు. ఈ ఆలయంలో పూజలు చేయడం వల్ల శత్రువులపై విజయం లభిస్తుందని ఒక నమ్మకం కూడా ఉంది. గ్రహశాంతి కోసం కూడా ఇక్కడ పూజలు చేస్తారు.

ఈ బగ్లాముఖి ఆలయం ఎక్కడ ఉందంటే

బగ్లాముఖి ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని బంఖండి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం. హిందూ పురాణాల ప్రకారం బగ్లాముఖి దేవి పది మహావిద్యలలో 8వ స్వరూపం. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. అమ్మవారి దర్శనం కోసం సాధారణ ప్రజలతో పాటు నాయకులు, రకాల ప్రముఖులు కూడా క్యూలు కడతారు. ఆలయం పాండవుల కాలంలో నిర్మించబడిందని, ఆ తర్వాత ఈ ప్రాంత పాలకులచే పునరుద్ధరించబడిందని కూడా నమ్ముతారు. ఈ ఆలయం అనేక శతాబ్దాలుగా అనేక పునరుద్ధరణలు , పునర్నిర్మాణ పనులను జరుపుకుంటూనే ఉంది.

ఇవి కూడా చదవండి

అమ్మవారికి ఇష్టమైన రంగు పసుపు

పసుపు రంగుకి బగ్లాముఖికి సంబంధం ఉంది. కనుక బగ్లాముఖిని పీతాంబర దేవి లేదా పీతాంబరి అని కూడా పిలుస్తారు. బగ్లాముఖి రంగు బంగారం లాంటి పసుపు. కనుక బగ్లాముఖికి అమ్మవారికి పసుపు రంగు అంటే చాలా ఇష్టమని చెబుతారు. బగ్లాముఖి బట్టలు, ప్రసాదం, మౌళి , సీటు, ఆలయంలో అమర్చిన ఫ్యాన్లు కూడా పసుపు రంగులోనే ఉన్నాయి. అమ్మవారిని పూజించడానికి ఉపయోగించే ముఖ్యమైన వస్తువులన్నీ పసుపు రంగులో ఉంటాయి.

మిరియాలతో హవనం

బగ్లాముఖి దేవాలయంలో ప్రతి రోజు జరిగే అగ్ని యాగాలకు (హవనాలకు) భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. బగ్లాముఖి ఆలయంలో భక్తుల ఇబ్బందులను తొలగించడానికి మిరియాలతో హవనం కూడా నిర్వహిస్తారు. కష్టాల నుంచి విముక్తి పొందేందుకు భక్తులు ఇక్కడికి వచ్చి మిరియాలతో హవనం చేస్తారు. వాస్తవానికి ఈ ఆలయంలో 136 రకాల హవనాలు, వేడుకలు జరుగుతాయి. పసుపు ఆవాలు, పసుపు వేర్లు, నల్ల మిరియాలు మొదలైన వివిధ పదార్థాలను ఉపయోగించి వివిధ పద్ధతుల ద్వారా వివిధ “హవాన్లు” నిర్వహిస్తారు.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *