
Stock Market: 28 ఏళ్ళలో అతిపెద్ద పతనం.. 5నెలల్లో రూ.91.13 లక్షల కోట్లు ఆవిరి..!
ఫిబ్రవరి చివరి ట్రేడింగ్ రోజు అంటే శుక్రవారం(ఫిబ్రవరి 28), భారత స్టాక్ మార్కెట్‌లో భారీ అమ్మకాలు కనిపించాయి. ఉదయం ట్రేడింగ్‌లోనే నిఫ్టీ, సెన్సెక్స్ తీవ్ర క్షీణతను నమోదు చేశాయి. నిఫ్టీ 50 పాయింట్లు పడిపోయి 22,433 వద్ద దిగువన ప్రారంభమైంది. ఆపై 400 పాయింట్లకు పైగా పడిపోయి, ఇంట్రాడే కనిష్ట స్థాయి 22,120ని తాకింది. అదే సమయంలో, సెన్సెక్స్ 74,201 స్థాయిలో ప్రారంభమైంది. తరువాత ఇంట్రాడేలో కనిష్ట స్థాయి 73,173 ను తాకింది. చివరికి 1,400 పాయింట్లకు…