సీనియర్ హీరో, విలక్షణ నటులు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ గారాలపట్టి గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం సాయంత్రం గాయత్రికి కార్డియాక్ అరెస్ట్ కావడంతో హైద్రాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు (శనివారం) మరణించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ తన కూతురి గురించి గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి వృత్తి రీత్యా డాక్టర్. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు తననీ కాదనీ, ప్రేమ పెళ్లి కారణంగా రాజేంద్రప్రసాద్ తో కాస్త విభేదాలు చోటు చేసుకున్నాయి. అయితే.. ఈ మధ్య కాలంలో కాస్త కలుసుకున్నారు. గాయత్రికి ఓ కూతురు ఉంది. ఆ చిన్నారి ‘మహానటి’ సినిమాలో జూనియర్ సావిత్రిగా నటించింది. ఒక్క సినిమాతోనే ఓ స్పెషల్ ఐడెంటి క్రియేట్ చేసుకుంది. గాయత్రి మరణంతో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. రాజేంద్ర ప్రసాద్ కు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించిందనీ, గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాననీ, రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్టు పవన్ కళ్యాన్ సానుభూతి ప్రకటించారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజేంద్ర ప్రసాద్ కు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరమనీ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి , కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.