అతను చేసిన పనికి 6నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు.. ఎమోష్నలైన స్టార్ హీరోయిన్

అతను చేసిన పనికి 6నెలలు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు.. ఎమోష్నలైన స్టార్ హీరోయిన్


ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. హీరోయిన్స్ కూడా దైర్యంగా బయటకు వచ్చి తమకు ఎదురైనా చేదు అనుభవాలను. ఇండస్ట్రీలో ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడారు చాలా మంది నటీమణులు. యంగ్ హీరోయిన్స్ దగ్గర నుంచి సీనియర్ హీరోయిన్స్ వరకు తాము ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కూడా తాను ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయం చెప్పింది. ఓ నిర్మాత అవమానంతో 6 నెలలు నరకం అనుభవించా అని చెప్పి ఎమోషనల్ అయ్యింది ఆ సీనియర్ నటి. ఇంతకూ ఆ అందాల భామ ఎవరు.? ఆమెను వేధించిన నిర్మాత ఎవరు.?

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో విద్యాబాలన్ ఒకరు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితురాలే.. విద్యాబాలన్ నటించిన డర్టీ పిచ్చర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలోనూ నటించి మెప్పించింది విద్య.

ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న విద్య తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఓ నిర్మాత తనను అవమానించాడని తెలిపింది విద్య బాలన్. తాజాగా విద్య మాట్లాడుతూ.. ఓ నిర్మాత తన దగ్గరకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. ఒక సినీ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. నా దగ్గరకు వచ్చి అసభ్యకరంగా, ఛండాలంగా పిలిచాడు. ఆ మాటలు నన్ను ఎంతో బాధపెట్టాయి. ఆ అవమానంతో నేను దాదాపు ఆరు నెలలపాటు నా ముఖాన్ని అద్దంలో చూసుకోలేదు. ఆ మాటలు నన్ను ఎంత బాధపెట్టాయంటే నేను ఆరు నెలల పాటు నరకం అనుభవించా.. ఆ మాటలకూ నేను మనిషిని కాలేకపోయా.. ఇలాంటి సంఘటనలు నా కెరీర్ లో చాలానే జరిగాయి. అదే టైం లో బాడీ షేమింగ్ కూడా చేశారు అని తెలిపింది విద్య బాలన్. అలాగే నాకు మలయాళంలో ఆఫర్ వచ్చింది. ఆ సమయంలో సినిమా ఆగిపోయింది. దాంతో అందరూ నన్ను  దురదృష్టవంతురాలు అన్నారు. ఎదో కారణంతో సినిమా ఆగిపోతే దానికి నేను కారణం అన్నారు. ఇలాంటివి నా కెరీర్ లో చాలా జరిగాయి అని చెప్పుకొచ్చారు విద్య బాలన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *