సీరియల్ బ్యూటీస్ కు సినిమా హీరోయిన్స్ కు ఉండే రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. హీరోయిన్స్ అయినా సినిమాల్లో కొద్దిసేపే కనిపిస్తారు. కానీ సీరియల్ బ్యూటీలు అలా కాదు.. ప్రతి రోజు టీవీల్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది సీరియల్ భామలు మంచి గుర్తింపు తెచ్చుకొని పాపులర్ అయ్యారు. కాగా కొంతమంది బిగ్ బాస్ షో, సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ తనను తెలుగులో బ్యాన్ చేశారు అని ఎమోషనల్ అయ్యింది. తన తప్పు లేకపోయినా కూడా తనను బ్యాన్ చేశారని చెప్పుకొచ్చింది. ఆ సీరియల్ బ్యూటీ.
తెలుగులో వస్తున్న సీరియల్స్ లో చాలా మంది కన్నడ నటీమణులు ఉంటారు.. వారిలో పల్లవి గౌడ ఒకరు. పసుపు కుంకుమ, సావిత్రి ,చదరంగం, సూర్యకాంతం సిరీయల్స్ తో పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. పసుపు కుంకుమ సీరియల్ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిన్నది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పల్లవి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనను టాలీవుడ్ ఎందుకు బ్యాన్ చేసిందో చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
నేను నా రెండో సీరియల్ షూట్ చేస్తున్నప్పుడు నాకు సినిమాలో ఛాన్స్ వచ్చింది. దాంతో పరిమిషన్ అడిగి సినిమా షూట్ కు వెళ్ళాను. అనుకోకుండా నేను బెంగుళూరు వెళ్ళాను అక్కడ 20రోజులు లాక్ అయ్యాను. తర్వాత షూటింగ్‌కు వెళ్లాను. ఒకేసారి సినిమా , సీరియల్ షూటింగ్స్ జరగడంతో డేట్స్ అడ్జెస్ట్ అవ్వక ఇబ్బందిపడ్డాను. అయితే సీరియల్ షూటింగ్ జరుగుతున్నా కూడా నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు. రెండు నెలలు డబ్బులు ఇవ్వలేదు. దాంతో నేను వేరే సీరియల్ కు డేట్స్ ఇస్తాను అని చెప్పా.. అయితే ఒక సీరియల్ జరుగుతున్నప్పుడు మరోదానికి ఎలా అగ్రిమెంట్ చేసుకుంటావ్ అంటూ నన్ను బెదిరించారు. ఇది జరిగిన కొద్దిరోజులకే నన్ను ఏడాది అపాటు తెలుగులో బ్యాన్ చేశారు. దాంతో నేను కన్నడ , మలయాళంలో సినిమాలు చేశాను. ఆతర్వాత తిరిగి తెలుగు నుంచి పిలుపు వచ్చింది అని తెలిపింది పల్లవి గౌడ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.