అభిమానుల అత్యుత్సాహం స్టార్ హీరోలకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ప్రస్టీజియస్‌గా తెరకెక్కుతున్న సినిమాలకు సంబంధించిన వీడియో లీక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అఫీషియల్ రిలీజ్ వరకు ఎంత దాచిపెట్టాలనుకున్నా… మేకర్స్‌కు అది సాధ్యపడటం లేదు. దీంతో ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి చిత్రయూనిట్ వరుస అప్డేట్స్ ఇస్తోంది. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి ప్రతీ విషయాన్ని షేర్ చేసుకుంటోంది. యూనిట్ ఇంత యాక్టివ్‌గా ఉన్నా… లీకులు మాత్రం తప్పటం లేదు. కేరళ షెడ్యూల్‌కు సంబంధించిన వీడియో వైరల్ కావటంతో యూనిట్ స్పందించింది. అలాంటి వీడియోలు వైరల్ చేస్తే చర్చలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
పవన్ సినిమాలకు కూడా ఈ లీకుల బెడద తప్పటం లేదు. హరి హర వీరమల్లు సినిమాలో పవన్ లుక్, అఫీషియల్ రిలీజ్ కన్నా ముందే రివీల్ అయ్యింది. ఓజీ ముంబై షెడ్యూల్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌కు సంబంధించిన వీడియో కూడా లీక్ అయ్యింది.
డార్లింగ్ ప్రభాస్ కూడా లీకు వీరుల బాధితుడే. ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ లుక్‌ను ఎంత దాచి పెట్టినా.. ముందే లీక్ అయ్యింది. ఇక టీజర్ విషయంలో అయితే యూనిట్‌కు పెద్ద షాకే తగిలింది. చెప్పిన టైమ్ కన్నా ముందే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ది రాజాసాబ్ టీజర్.
షూటింగ్ విషయంలో మ్యాగ్జిమమ్ కేర్ తీసుకునే రాజమౌళి కూడా లీకులను ఆపలేకపోయిరా… ఎస్ఎస్ఎంబీ 29కు సంబంధించి జక్కన్న ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోయినా… ఒరిస్సా షెడ్యూల్లో లీక్ అయినా వీడియోతో మహేష్ లుక్ రివీల్ అయ్యింది. ఇలా వరుస లీకులు ఇబ్బంది పెడుతుండటంతో లీగల్ యాక్షన్ తీసుకోవటం తప్ప మేకర్స ఏమీ చేయలేకపోతున్నారు.