సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ హీరోలకు సమానంగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే మరికొంతమంది హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇండస్ట్రీలోనే ఆమె ఓ తోప్ హీరోయిన్.
ఇక స్టార్ హీరోయిన్స్ కు బాడీ గార్డ్స్ ఉండటం చాలా కామన్. ఈ స్టార్ హీరోయిన్ కూడా ఓ బాడీ గార్డ్ ఉన్నారు. అతని జీతం ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ స్టార్ హీరో జీతం కోట్ల రూపాయిలు. ఓ కంపెనీ సీఈఓ జీతంతో ఆ బాడీ గార్డ్ జీతం సమానం. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె.. దీపికా పదుకొణె ఇప్పుడు బాలీవుడ్లో నంబర్ 1 స్టార్ హీరోయిన్. ఇక కల్కి సినిమాతో దక్షిణాదిలోనూ ఆమెకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. హాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించిన దీపిక ఇప్పుడు సినిమా షూటింగులకు కాస్త విరామం ఇచ్చింది.
కొన్ని నెలల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఇప్పుడు తన కూతురు ఆలనా పాలనలో బిజీ బిజీగా ఉంటోంది. బిలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ చిన్నది. త్వరలోనే తిరిగి సినిమాల్లో బిజీగా మారనుంది. 2018లో రణవీర్ సింగ్, దీపికా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత అంటే 2024లో ఈ జంట బిడ్డకు జన్మనిచ్చారు.
ఇదిలా ఉంటే దీపికా బాడీ గార్డ్ జీతం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతని పేరు జలాలుద్దీన్. అతను కేవలం బాడీ గార్డ్ మాత్రమే కాదు.. అన్నయ్య లాంటి వాడు కూడా.. అతని జీతం రూ. 80లక్షల నుంచి రూ. 1.2 వరకు ఉంటుందని తెలుస్తుంది.