భూమాతను నమ్ముకుని ఆరుగాలం సేద్యం చేసే ఓ రైతన్న కుటుంబం విద్యుదాఘాతనికి బలైంది.. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంటను… అడవి పందుల బెడద రక్షించేందుకు వెళ్లిన ఓ రైతన్న కుటుంబాన్ని మృత్యువు కబళించింది.. రైతు, ఆయన భార్య .. కొడుకు ముగ్గురూ కలిసి పంట చేను దగ్గరకు వెళ్లగా.. కరెంట్ షాక్ తగిలి ముగ్గురూ మరణించారు.. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. రెంజల్ మండలం శాటాపూర్ గ్రామంలోని పంటపొలాల్లో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన దంపతులు గంగారం (45), బాలామణి (40) లతో పాటు వారి కొడుకు కిషన్ (22)లు ఉదయాన్నే పంట పొలానికి వెళ్లారు. పంట చేలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉండటంతో వాటి నుంచి పంటను రక్షించుకోడానికి కరెంట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనుకున్నారు.. ఈ క్రమంలో పొలం దగ్గర బోరు మోటార్ కు ఉన్న కరెంట్ వైర్ తగలడంతో ముగ్గురూ మరణించారు.
మొదట గంగారాంకు షాక్ తగలడంతో .. పక్కనే ఉన్న ఆయన భార్య బాలామణి భర్తను కాపాడ బోయి ఆమె కూడా విద్యుదాఘాతానికి గురయ్యింది. కొంచెం దూరంలో ఇది గమనించిన కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రులను కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు..
ముగ్గురూ కూడా కరెంట్ షాక్‌కు గురై.. అక్కడికక్కడే మృతిచెందాడు.. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్ఐ మచ్చేందర్ తెలిపారు. ఈ ఘటనతో సాటాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.