అరటిపండు తిన్న వెంటనే ఈ తప్పు అస్సలు చేయొద్దు.. ఎందుకంటే..?

అరటిపండు తిన్న వెంటనే ఈ తప్పు అస్సలు చేయొద్దు.. ఎందుకంటే..?


మనలో చాలా మంది హెల్తీ అలవాట్లలో భాగంగా అరటిపండును ప్రతిరోజూ తింటుంటారు. ఇది తక్కువ ధరకే దొరికే.. ఎప్పుడూ లభించే అద్భుతమైన పోషక ఆహారం. అయితే అరటిపండు తిన్న వెంటనే చేసే ఓ కామన్ తప్పు.. దాని నుంచి పొందాల్సిన లాభాలను కోల్పోయేలా చేస్తుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా..?

అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపులో సమస్యలు వస్తాయని తెలుసా..? అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అది నీటితో కలిసినప్పుడు జీర్ణక్రియపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

అరటిపండు తిన్న వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు?

అరటిపండు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగడం వల్ల అందులోని పొటాషియం నీటిలో కలిసిపోయి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది కడుపులో మంట, పొట్ట ఉబ్బరం వంటి చిన్నపాటి ఇబ్బందులకు దారి తీస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం మనం తినే అరటిపండు వల్ల ఇలా హాని కలగడం సరికాదు కదా.

మరి ఎప్పుడు నీళ్లు తాగాలి..?

అరటిపండు తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాతే నీళ్లు తాగాలి. అలా చేయడం ద్వారా దానిలోని పోషకాలు శరీరానికి సరిగ్గా ఒంటబడతాయి. జీర్ణవ్యవస్థకు కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

అరటిపండు తినడానికి బెస్ట్ టైం

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ టైంలో లేదా మధ్యాహ్నం అలసట వచ్చినప్పుడు అరటిపండును తీసుకోవచ్చు. అలాగే పెరుగు లాంటి ఆరోగ్యకరమైన పదార్థాలతో కలిపి తింటే మరింత మంచిది. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది.

అరటిపండు తినడం వల్ల కలిగే ముఖ్యమైన లాభాలు

  • అరటిపండులో ఉన్న పొటాషియం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
  • కాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది.
  • విటమిన్ A, విటమిన్ C వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *