ఆస్తి కోసం బరితెగించిన భార్యభర్తలు.. మేకలు కాసేందుకు పొలానికి వెళ్లిన బావను వెంటాడి..

ఆస్తి కోసం బరితెగించిన భార్యభర్తలు.. మేకలు కాసేందుకు పొలానికి వెళ్లిన బావను వెంటాడి..


భూ వివాదాలు మానవ సంబంధాలను మంటగలిసేలా చేస్తున్నాయి.. ఆస్తి కోసం క్రూర మృగాల్లా మారి.. సొంత రక్తసంబంధీకులనే చంపుతున్నారు.. అచ్చం ఇలాంటి ఘటనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది. ఆస్తి కోసం తోడబుట్టిన అక్క భర్తను అతికిరాతకంగా చంపిన బావమరిది ఆయన భార్య.. కిరాతకంగా ప్రవర్తించారు.. మేకల కాపలకు వెళ్ళిన ఆ రైతును గోడ్డలితో నరికి చంపి కసి తీర్చుకున్నాడు. ఆ పై సినిమా కథ అల్లారు.. మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చాకచక్యంగా చేధించారు.. హత్యకు పాల్పడిన దంపతులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు.

అసలేం జరిగిందంటే..

ఈనెల 23వ తేదీన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామ శివారులో ఈ హత్య జరిగింది.. ఉప్పలయ్య అనే రైతు తన పొలంవద్ద మేకలను మేతకు తీసుకు వెళ్ళాడు.. ఈ క్రమంలో దారుణ హత్యకు గురి అయ్యాడు.. గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపి పారిపోయారు.

విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించి విచారణ చేపట్టారు ఈ విచారణలో మృతుడు ఉప్పలయ్య సొంత బావమరిది మల్లేష్ అతని భార్య ఉమా కలిసి హత్య చేసినట్లుగా గుర్తించారు.. పథకం ప్రకారం గొడ్డలి, ఇనుప రాడ్డు, కత్తి వెంట తెచ్చుకొని అతన్ని వెంటాడి గ్రామ శివారులో హత్యచేశారు.. ఆ తర్వాత సినీ ఫక్కీలో వారు ఉపయోగించిన మారణాయుధాలు గ్రామ శివారులోని గడ్డివాములో దాచి ద్విచక్ర వాహనంపై పారిపోయారు..

ఈ హత్య అనంతరం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు.. మల్లేష్ తండ్రి పేరు మీద ఉన్న 3 ఎకరాల 10 గుంటల భూమిని నిందితుడు తెలియకుండానే మృతుడు ఉప్పలయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.. ఈ విషయంపై బావ – బామ్మర్దికి తరచూ గొడవలు జరుగుతుండేవి.. ఈ క్రమం లోనే మల్లేష్ అతని భార్య ఉమా కలిసి బావ హత్యకు స్కెచ్ వేశారు.. పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చారు.

అయితే నిందితుడు మల్లేష్ కు మొత్తం ముగ్గురు అక్కలు ముగ్గురు బావలు ఉన్నారు.. పెద్దక్క కోమలి వద్ద ఇతని తండ్రి చెన్నయ్య ఉంటున్నాడు. అయితే మల్లేష్ కు తెలియకుండానే తండ్రి పేరిట ఉన్న భూమిని అక్క భర్త ఉప్పలయ్య పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.. ఈ క్రమంలోనే కక్ష పెంచుకొని అదును చూసి హతమార్చినట్లుగా పోలీసులు గుర్తించారు.

హత్యకు పాల్పడిన దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దురాశ దుఃఖానికి చేటు అన్నట్లుగా ఆస్తికోసం సొంత అక్క భర్తను అతికిరాతకంగా చంపిన మల్లేష్ అతని భార్య ఇప్పుడు కటకటాల పాలయ్యారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *