ఆహా.! మండే ఎండల్లో ఎంత చల్లటి వార్త చెప్పారండీ.. వచ్చే 3 రోజుల వాతావరణం ఇలా..

దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలో ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ఎండీ తెలిపారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వేడిగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండదు.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

ఈరోజు, రేపు:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వేడిగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.

ఎల్లుండి:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండదు.

రాయలసీమ:-

తెలంగాణలో ఇలా..

అటు తెలంగాణలో భానుడి భగభగలకు కాస్త రిలీఫ్ రానుంది. మార్చి 20-25 మధ్య కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది అని వాతావరణ ఎక్స్‌పర్ట్ చెప్పాడు. మరి చూడాలి. సూర్యుడి భగభగలకు కాస్త రిలీఫ్ దొరుకుతుందో లేదో..

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *