ఆ పాంత్రంలో ఆదివారం నాన్-వెజ్ బంద్.. అంతా ఉపవాసమే!.. కారణం ఏమిటంటే?

ఆ పాంత్రంలో ఆదివారం నాన్-వెజ్ బంద్.. అంతా ఉపవాసమే!.. కారణం ఏమిటంటే?


ఆ పాంత్రంలో ఆదివారం నాన్-వెజ్ బంద్.. అంతా ఉపవాసమే!.. కారణం ఏమిటంటే?

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలో పెద్దాపూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామ జనాభ రెండు వేలు ఉంటుంది, ఈ గ్రామ నడిబొడ్డున మల్లన్న స్వామీ కొలువై ఉన్నారు. వందల సంవత్సరాల నుండి ఇక్కడివారు స్వామీవారిని మొక్కుతూ జీవిస్తున్నారు. అయితే ఆదివారం మల్లన్నకు ఇష్టమైన రోజు కావడంతో ఈ రోజు గ్రామంలో ఏ ఒక్కరు మధ్యం,మాంసం ముట్టరూ. 1972 సంవత్సరంలో ఈ గ్రామంలో ఉన్న మల్లన్నకు ఆలయాన్ని నిర్మించారు. అప్పటినుండి ఆ దేవుడే నమ్ముకుంటు ఈ గ్రామస్తులు జీవిస్తున్నారు. ప్రతి ఆదివారాల్లో ఇక్కడికి భక్తులు వచ్చి స్వామీవారిని దర్శించుకుంటారు. కొలిచిన వారికి కొంకుబంగారంగా ఉంటాడని ఇక్కడి వారు చెపుతుంటారు.

గ్రామంలోని ప్రతీ ఇంట్లో జరిగే ప్రతి కార్యానికి స్వామీ వీరు స్వామిని పూజిస్తుంటారు. పిల్లలు చదువులకోసం వెళ్లినప్పుడు. వ్యవసాయ పనులు మొదలు పెట్టినప్పుడు. కొత్తగా వివాహాం జరిపించేప్పుడు. విదేశాలకు వెళ్లేప్పుడు.. ఇలా ఏ పనినైన మల్లన్న సాక్షిగానే చేస్తారు. అందుకే గ్రామమంతా ప్రశాంతంగా ఉంటుందని చెపుతారు. ఎవరైన ఏదైన తప్పు చేసి ఒప్పుకోకపోతే గుడివద్దకు తీసుకువచ్చి చెప్పమంటారు. దీంతో దేవుడు ముందు అబద్ధాలు చెప్పలేక నిజాలు ఒప్పుకొని ఎన్నో సమస్యలు పరిస్కారం కూడా అయిన దాకలాలు ఉన్నాయి. అంతేకాదు పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కడమనేది ఈ గ్రామస్తులకు దాదాపుగా అవసరం లేదు, ఏ చిన్న సమస్య వచ్చినా గ్రామంలోనే పరిస్కరించుకుంటున్నారు. దీంతో గ్రామంలో ఎలాంటి చిన్నపాటి గొడవలు జరగకుండా ముందుకువెళ్తున్నారు.

అంతేకాదు ప్రతి సంవత్సరం మార్చి మాసంలో కాముడు పౌర్ణమి తర్వాత వచ్చె ఆదివారం రోజు అతి భారీగా ఈ గ్రామంలో మల్లన్న జాతర నిర్వహిస్తారు. శనివారం రోజు స్వామీవారిని గోదావరికి తీసుకెళ్లి స్నానం చేయించి రాత్రివేళల్లో కళ్యాణం నిర్వహిస్తారు. ఆదివారం రోజు ఉదయం నుండి గ్రామమంతా సందడిగ మారుతుంది. ఆ రోజు ఎక్కడేక్కడి నుండో భక్తులు వచ్చి స్వామి వారికి మొక్కులు సమర్పించుకుంటారు. ఆ రోజు గ్రామంలో బోనాల తీస్తారు. ఈ బోనాల పండుగ జాతరలో సుమారు లక్షకు పైగా బోనాలు సమర్పించడం విశేషం. తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా ప్రతి సంవత్సరం లక్షకు పైగా బోనాలు తీయడం ఇక్కడి ప్రత్యేకత. అనంతరం సోమవారం రోజు మిగతా కార్యక్రమాలు పూర్తి చేసి జాతర ముగిస్తారు. ఎన్నో సంవత్సరాలుగా ఇది ఆచారంగా కొనసాగుతుందని మల్లన్న స్వామి తమ గ్రామానికి అండగా ఉన్నాడని అందుకే స్వామి వారి పాదాల వద్ద తమ ప్రతి కోరిక ఉంచుతామని గ్రామస్తులు చెబుతున్నారు.

ఎప్పుడు చూసినా గ్రామం గ్రామమంతా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక్కడ వివాదాస్పదమైన వాతావరణం మనకు కనిపించదు యువకులు, వృద్ధులు పెద్దలు ఇలా తారాతామ్యం భేదం లేకుండా ఎవరికి వారు తమ పని నిర్వర్తిస్తుంటారు. సమస్య వచ్చినప్పుడు వారికి వారే పరిష్కరించుకుంటారు. ఇతరులపై ఆధారపడకుండా కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా జీవిస్తున్న ఈ గ్రామస్తులు ఎందరికో ఆదర్శం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *