టాలీవుడ్ లో ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన అన్నా తమ్ముళ్లు, అక్కా చెల్లెల్లు హీరోలుగా హీరోయిన్స్ గా రాణించిన సందర్భాలు చాలా వున్నాయి. హీరోలు చాలా మంది ఉన్నారు కానీ హీరోయిన్స్ మాత్రం తక్కువే అని చెప్పాలి పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మలు గుర్తున్నారా.. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఈ భామలదే హవా.. ముఖ్యంగా నగ్మా. అందాలతారగా అప్పట్లో నగ్మా ఒక సన్సేషన్. ఆమె నటనకు.. అందంకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు నగ్మా. అప్పట్లో నగ్మా హీరోయిన్ అంటే చాలు ఆ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చేది. ఇక నగ్మా సిస్టర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు జోతిక. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన జోతిక హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. అలాగే నగ్మా మరో సిస్టర్ రోషిని కూడా హీరోయిన్ గా సినిమాలు చేశారు.
ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్
అయితే ఏ ముగ్గురు హీరోయిన్స్ తో నటించిన ఏకైక హీరో ఒకరు ఉన్నారు. ఆయన ఇప్పటికి హీరోగా కంటిన్యూ అవుతున్నారు. కానీ ఈ భామల్లో జోతిక మినహా మిగిలిన వారు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.. ఈ ముగ్గురు హీరోయిన్స్ తో ఆ స్టార్ హీరో నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరంటే..
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?
ఇంకెవరు మన మెగాస్టార్ చిరంజీవి.. మెగాస్టార్ చిరంజీవి పైన కనిపిస్తున్న ముగ్గురు సిస్టర్స్ తో సినిమాలు చేశారు. ఈ భామలు చిరు సరసన హీరోయిన్స్ గా నటించిన సినిమాలు ఏవంటే.. నగ్మా , మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలో ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు. ఈ సినిమాల్లో ఘరానా మొగుడు సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే జోతికతో కలిసి మెగాస్టార్ నటించిన సినిమా ఠాగూర్.వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే రోషినితో కలిసి చిరంజీవి మాస్టర్ సినిమాలో నటించారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఇది కూడా చదవండి :18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు.. చివరకు ఇప్పుడు ఇలా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి