ఇదేందయ్యా ఇది.. 7 పరుగులకే ఏడుగురు ఔట్.. తొలి ఓవర్‌లోనే 3 వికెట్లతో భయపెట్టిన పాక్ బౌలర్

ఇదేందయ్యా ఇది.. 7 పరుగులకే ఏడుగురు ఔట్.. తొలి ఓవర్‌లోనే 3 వికెట్లతో భయపెట్టిన పాక్ బౌలర్


భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ వంటి దేశాల తర్వాత ఇప్పుడు నేపాల్‌లోనూ టీ20 లీగ్ ఫీవర్ వ్యాపించింది. క్రికెట్‌పై ఉన్న క్రేజ్‌తో ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్న నేపాల్.. ఇప్పుడు తన కొత్త లీగ్‌తో కూడా వార్తల్లోకి రావడం ప్రారంభించింది. భారత దిగ్గజం శిఖర్ ధావన్, న్యూజిలాండ్ స్టార్ మార్టిన్ గప్టిల్ వంటి ప్రముఖ మాజీ క్రికెటర్ల కారణంగా ఈ లీగ్ గురించి నిరంతరం చర్చ జరుగుతుంది. అయితే, ఇప్పుడు మైదానంలో షాకింగ్ పర్ఫార్మెన్స్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. టోర్నీలోని ఐదో మ్యాచ్‌లో, ఒక జట్టు టాప్ ఆర్డర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మొదటి ఏడుగురు బ్యాట్స్‌మెన్స్ మొత్తం 7 పరుగులు మాత్రమే చేయగలిగారు. సహజంగానే ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది.

రైనోస్ 161 పరుగులు..

మంగళవారం డిసెంబర్ 3న కీర్తిపూర్‌లో జరిగిన నేపాల్ ప్రీమియర్ లీగ్ 5వ మ్యాచ్‌లో చిత్వాన్ రైనోస్ వర్సెస్ పోఖారా ఎవెంజర్స్ ముఖాముఖిగా తలపడ్డాయి. రెండు జట్లలో, ఎక్కువ మంది ఆటగాళ్లు నేపాల్‌కు చెందినవారు కాగా, కొంతమంది ప్రసిద్ధ అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయితే, పోటీ ఇప్పటికీ ఏకపక్షంగానే ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రైనోస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ రవి బొపారా అత్యధికంగా 52 పరుగులు చేశాడు. నేపాల్ యువ బ్యాట్స్‌మెన్, జట్టు కెప్టెన్ కుశాల్ మల్లా 23 బంతుల్లో 38 పరుగులు చేశాడు.

తొలి ఓవర్‌లోనే ఆట మలుపు..

అనంతరం పోఖారా అవెంజర్స్‌కు 162 పరుగుల టార్గెట్ ఉంది. ఈ జట్టు కూడా బలమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మారుస్తుందని భావించారు. అయితే, జరిగింది మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. జట్టు కెప్టెన్ కుశాల్ భుర్టెల్ సహా జట్టు తొలి ఓవర్ లోనే 3 వికెట్లు కోల్పోయింది. తొలి బంతికే ఔటయ్యాడు. పొడవాటి పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ సోహైల్ తన్వీర్ పోఖారా దెబ్బకు విలవిల్లాడిపోయింది. మూడు వికెట్లు పడగొట్టి జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత నేపాలీ బౌలర్ రిజన్ ధికాల్ వంతు వచ్చింది. అతను కూడా ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో కేవలం 4 ఓవర్లలో జట్టు 6 వికెట్లు కోల్పోయింది. అయితే స్కోరు 7 పరుగులు మాత్రమే కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

7గురు బ్యాటర్లు 7 పరుగులే..

ఏడో వికెట్ పడటానికి ఎక్కువ సమయం పట్టలేదు. 7వ ఓవర్లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రామన్ రీఫర్ కూడా నిష్క్రమించాడు. ఈ విధంగా, పోఖారా 17 పరుగుల స్కోరు వరకు తన మొదటి ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ల వికెట్లను కోల్పోయింది. ఈ ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ల స్కోర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.. 0, 1, 4, 0, 1, 1, 0. అంటే ఈ ఏడుగురు మంది బ్యాట్స్‌మెన్‌లు కలిసి 7 పరుగులు మాత్రమే చేశారు. లోయర్ ఆర్డర్ లో మార్కస్ క్రిచ్లీ 17 పరుగులు, నారాయణ్ జోషి 30 పరుగులు చేసి జట్టును చెత్త స్కోర్ నుంచి తప్పించారు. అయితే, జట్టు మొత్తం 13.2 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలి 87 పరుగుల తేడాతో ఓడిపోయింది. సోహైల్ తన్వీర్ 3 ఓవర్లలో 6 పరుగులిచ్చి 3 వికెట్లు, ధికాల్ 3 ఓవర్లలో 10 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. ల్యూక్ బెకెన్‌స్టెయిన్ 3 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *