మన ప్రవర్తన, అభిరుచులు మన మనస్సును ప్రతిబింబిస్తాయి. మన గురించి అనేక విషయాలు మనకే తెలియకుండా బయటపడుతుంటాయి. వాటిలో రంగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మన మనస్తత్వాన్ని అవి స్పష్టంగా తెలియజేస్తాయి. మనం ఎలాంటి వ్యక్తిత్వం కలిగివున్నామో.. మన ఆలోచనా విధానం ఎలా ఉంటుందో రంగుల ద్వారా గుర్తించవచ్చు.
మీకు నీలం రంగు అంటే ఇష్టమా..? అయితే మీరు ప్రశాంతతను ఎక్కువగా ఇష్టపడతారు. హై డ్రామా, అస్తవ్యస్తతకు దూరంగా ఉండి ప్రశాంత వాతావరణం కోసమే చూస్తుంటారు. గందరగోళం మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది. టీవీ పెద్దగా ఉన్నా కూడా మీకు ఇబ్బంది కలిగించవచ్చు. దీని కారణంగా నీలం రంగు మూడ్‌ను ప్రశాంతంగా ఉంచుతుంది.
నీలం రంగు ఇష్టపడే వ్యక్తులు భావోద్వేగాలలో లోతును ఇష్టపడుతారు. పెద్ద విందులు, హైసోసైటీ పార్టీలు కన్నా సన్నిహిత స్నేహితులతో వ్యక్తిగత చర్చలు మీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి. నీటి లోతులో ఉన్న ప్రశాంతత మాదిరిగానే వీరు బంధాలలో కూడా గాఢతను కోరుకుంటారు.
నీలం రంగు ప్రేమికులు వివాదాలను పరిష్కారం చేయడంలో నైపుణ్యం కలిగినవారుగా ఉంటారు. వివాదాల సమయంలో గందరగోళ పరిస్థితుల్లో వీరు వాటిని పరిష్కరించేందుకు ముందడుగు వేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు మధ్య శాంతి కావాలని కోరుకుంటారు.
మీరు నీలం రంగును ఇష్టపడితే స్థిరత్వం మీకు ముఖ్యమైనది. ప్రతిరోజు ఏమి చేయాలో ముందే తెలుసుకోవడం.. మంచి ప్రణాళిక కలిగి ఉండటం మీకు శాంతిని ఇస్తాయి. జీవితంలో నమ్మకంగా ఉండే వ్యక్తిగా మీరు సులభంగా గుర్తించబడతారు.
నీలం రంగు అంటే ఆలోచనాత్మకంగా ఉండటం. మీరు ఎప్పుడూ గమనించే, ఆలోచన చేయగలిగే వ్యక్తిగా ఉంటారు. ప్రతిరోజు జర్నలింగ్ చేయడం ద్వారా మీ భావాలను ప్రాసెస్ చేసుకుంటారు. సమస్యలపై మీరు చొరవ తీసుకోని స్పందించక ముందే వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
నీలం రంగును ఇష్టపడే వ్యక్తులు ప్రకృతి అందాలను ఎక్కువగా ఇష్టపడతారు. విశాలమైన ఆకాశం, నీలం సముద్రం వంటివి మీకు ఓదార్పు ఇస్తాయి. మీ ఆలోచనలకు విముక్తి క్షణాలను ఇస్తాయి.
నీలం రంగు విశ్వసనీయతకు ప్రతీక. మీరు నమ్మదగిన వ్యక్తిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మీ మాటను నిలబెట్టుకోవడం మీకు చాలా ముఖ్యమైన విషయం.