ఈ పండు తొక్క ఖరీదు బంగారం కంటే ఎక్కువ..! ఎక్కడ పండిస్తారు.. ప్రయోజనాలు ఏమిటంటే..

ఈ పండు తొక్క ఖరీదు బంగారం కంటే ఎక్కువ..! ఎక్కడ పండిస్తారు.. ప్రయోజనాలు ఏమిటంటే..


ప్రపంచంలో చాలా విలువైన పండ్లు కూడా ఉన్నాయి. అటువంటి పండ్లలో ఒకటి టాన్జేరిన్. దీనిని చైనాలో కాంటోనీస్ అని పిలుస్తారు. ఈ పండు తొక్క ధర బంగారం కంటే ఎక్కువ విలువైనదని తెలిస్తే మీరు షాక్‌ అవుతారు.. అవును… ఈ పండు ఎండబెట్టిన తొక్క అత్యంత ఖరీదు ధరకు అమ్ముడవుతోంది. చైనీస్ ఔషధ మొక్కలలో పాత టాన్జేరిన్ తొక్క ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పండు తొక్క అనేక పోషకాలను కలిగి ఉంటుందని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇది చాలా ప్రదేశాలలో పండించినప్పటికీ, చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జియాంగ్‌మెన్ తూర్పు తీరంలో పండే పంట అత్యంత విలువైనదిగా చెబుతున్నారు.

ఈ పండు తొక్క పొడి ‘చపానీ’ అని పిలుస్తారు. ఇది అంత సులువుగా తయారు కాదు.. ప్రతి శరదృతువు, చలికాలంలో లభించే ఈ పండు తొక్కను సుమారు మూడు సంవత్సరాల పాటు ఎండలో ఎండబెట్టడం వలన చపానీని తయారు చేస్తారు. బెరడు ఎంత పెద్దదైతే అంత ఖరీదుగా విక్రయిస్తారని చెబుతున్నారు. పొడిని ఆరోగ్యంతో పాటు, ఇది ఆహారం, మద్యంలో కూడా ఉపయోగిస్తారు.

ఈ పండు ఖరీదు ఎంతో తెలుసా?

ఇవి కూడా చదవండి

ఈ పండు తొక్క విలువను కూడా నివేదికలో పేర్కొన్నారు. 2023లో ఒక కిలోగ్రాము ఎండిన టాన్జేరిన్ తొక్క హాంకాంగ్‌లో US$9646కు వేలం వేయబడింది. వారు 2023లో 100 బిలియన్ యువాన్లు (సుమారు $13.8 బిలియన్లు) సంపాదిస్తారని అంచనా.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *