మహాభారతంలో విస్తారంగా ప్రస్తావించబడిన విదురుడు జ్ఞానం, ధర్మంలో గొప్ప పండితుడు. విదుర నీతి ఒక సంపూర్ణ నీతి గ్రంథం, ఇందులో విధివిధానాలు, ఆచారాలు, ధర్మసూత్రాలు స్పష్టంగా వివరించబడ్డాయి. ఈ గ్రంథంలో మనిషి ఆచరణలో పాటించాల్సిన అనేక జీవిత మార్గదర్శకాలు ఉన్నాయి. ఇందులో కొన్ని పనులు మనం ఒంటరిగా ఎప్పుడూ చేయకూడదని చెప్పారు. ఈ పనులు ఒంటరిగా చేయడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తారు.
విదుర నీతి ప్రకారం ఒంటరిగా తినడం సత్ఫలితాలను ఇవ్వదు. భోజనం అనేది ఇతరులతో కలసి చేయడం వల్ల ఆనందం పొందగలిగేది. మీరు ఒంటరిగా తినడం అనేది మనిషి శ్రేయస్సుకు వ్యతిరేకంగా ఉంటుంది. భోజనం చేసే సమయంలో మీ చుట్టూ ఉన్నవారిని కూడా ఆహ్వానించి వారికి సహాయం చేయడం మానవత్వానికి నిదర్శనం. ఇదే కాకుండా ఇతరులతో కలిసి భోజనం చేయడం అనేది సమాజంలో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తుంది.
విదుర నీతి మరో ముఖ్యమైన విషయం మనకు తెలియజేస్తుంది. అది ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఎలాంటి పెద్ద నిర్ణయమైనా తీసుకోవాల్సిన సందర్భంలో స్నేహితులు లేదా నమ్మకస్తులు నుండి సలహాలు తీసుకోవడం అవసరం. ఒంటరిగా తీసుకునే నిర్ణయాలు మంచివి కాకపోవచ్చు. అందుకు ఎవరైనా అనుభవజ్ఞుడి సలహా తీసుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు.
విదుర నీతి ప్రకారం మనం ఒంటరిగా మేల్కొని ఉండడం వల్ల ఆలోచనల్లో చెడు ప్రభావం పడుతుందని చెబుతారు. రాత్రిళ్లు చుట్టూ ఉన్నవారు నిద్రలో ఉన్నప్పుడు మనం ఒంటరిగా మేల్కొని ఉండకూడదు. మనసుకు, శరీరానికి విశ్రాంతి అవసరం. రాత్రిపూట నిద్ర మంచిగా లేనప్పుడు మన ఆరోగ్యానికి చెడు ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇతరులతో పాటు నిద్రపోయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
విదుర నీతి ప్రకారం నిర్జన ప్రదేశాలలో ఒంటరిగా ప్రయాణించడం ప్రమాదకరం. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు దొంగలు లేదా చెడు వ్యక్తులు దాడి చేసే అవకాశం ఉంటుంది. సమాజంలో మన రక్షణ కోసం మనం ఎల్లప్పుడూ ఒకరితో ప్రయాణించడం మంచిదని చెబుతారు. నిర్జన ప్రదేశాలలో ఒంటరిగా తిరగడం అనేది ప్రాణాలకు హాని కలిగించగలదు. కాబట్టి మీ ప్రయాణాలు ఎప్పుడూ ఇతరులతో కలిసి ఉండేలా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.