ఉదయం అలారంతో నిద్ర లేచే అలవాటు ఉందా.. వెంటనే మార్చుకోండి.. అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి

ఉదయం అలారంతో నిద్ర లేచే అలవాటు ఉందా.. వెంటనే మార్చుకోండి.. అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి


ఒకప్పుడు సూర్యోదయానికి కంటే ముందే కోడి కూతతో మేల్కొనే వారు. అయితే ప్రస్తుతం ఈ అలవాటు మారింది. రోజు ఉదయం అలారం మోగితేనే నిద్రలేచే కాలం నెలకొంది. ఈ అలవాటు పట్టణీకరణ ప్రజల జీవన విధానాన్ని మార్చడమే కాదు అనేక సమస్యలకు నాంది పలికింది. ఆధునిక జీవితాన్ని సులభతరం చేసింది. అదే సమయంలో వ్యాధుల బారిన పడుతున్న వారు కూడా అధికం అయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి గడియారం అలారం మోత కూడా చేర్చబడింది. ఉదయాన్నే ఈ శబ్దంతో కూడిన గడియారం నిద్రకు భంగం కలిగించడమే కాదు అధిక రక్తపోటు రోగిని చేస్తుంది.

ఒక పరిశోధన ప్రకారం అలారం మోగడం వల్ల నిద్ర లేచే వ్యక్తులు అధిక రక్తపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. UVA స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచి తాజా పరిశోధన ప్రకారం అలారం శబ్దం వినడం వలన రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ అలవాటు హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అలారం శబ్దంతో మేల్కొనే వ్యక్తులకు అలారం క్లాక్ లేని వారి కంటే 74 శాతం అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని ఈ పరిశోధనలో తేలింది.

అధిక రక్తపోటు ఎందుకు పెరుగుతుందంటే

ఇవి కూడా చదవండి

నర్సింగ్ డాక్టరల్ విద్యార్థి యూన్సు కిమ్ ఈ పరిశోధనలో ఎవరినైనా బలవంతంగా నిద్ర నుంచి మేల్కొల్పడం వల్ల అధిక రక్తపోటు పెరుగుతుందని కనుగొన్నారు. ఇందులో గడియారం అలారం కూడా ఉంది. ఈ శబ్దం విన్న తర్వాత ప్రజలు త్వరగా మేల్కొలపడానికి ప్రయత్నించినప్పుడు రక్తపోటు పెరుగుతుంది. అలారం మోగినప్పుడు.. మన శరీరం దానికి చూపే ప్రతిచర్య రక్తపోటు పెరిగే అవకాశాలను పెంచుతుంది. అంతేకాకుండా.. ఉదయం రక్తపోటు పెరగడం వల్ల, స్ట్రోక్ , గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

32 మందిపై పరిశోధన

ఈ విషయంపై కిమ్ రెండు రోజుల పాటు 32 మందిపై అధ్యయనం చేశారు. పరిశోధన సమయంలో వారు స్మార్ట్ వాచ్‌లతో పాటు వేలికి రక్తపోటు కఫ్‌లను ధరించేలా చేశారు. మొదటి కొన్ని రోజులు ఎలాంటి అలారం లేకుండా సహజంగా మేల్కొనాలని కోరారు. కొన్ని రోజుల తర్వాత.. ఐదు గంటల నిద్ర తర్వాత నిద్ర లేవడానికి అలారం పెట్టుకోమని అడిగారు. అలారం సౌండ్ తో బలవంతంగా నిద్రలేచిన వ్యక్తుల రక్తపోటు సహజంగా నిద్రలేచిన వారి కంటే 74 శాతం ఎక్కువగా ఉందని ఈ పరిశోధన వెల్లడించింది.

రక్తపోటుతో పాటు పెరుగుతున్న ఇతర సమస్యలు

బలవంతంగా నిద్ర లేవడం వలన తక్కువ సమయం నిద్ర, తరచుగా నిద్రకు అంతరాయం ఏర్పడుతున్నట్లు కనుగొన్నారు. ఉదయాన్నే శబ్దం విన్న తర్వాత మేల్కొన్నప్పుడు.. ఈ హడావిడి గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీని కారణంగా రక్తపోటుతో పాటు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆందోళన, మెడ నొప్పి పట్టడం, ముక్కు నుంచి రక్తస్రావం, తలనొప్పి వంటి ఇబ్బంది తలెత్తవచ్చు.

సొంతంగా లేవడం అలవాటు చేసుకోండి

అయితే… శ్రావ్యమైన సంగీతం వింటూ నిద్ర లేచినప్పుడు.. అది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుందని కూడా ఈ పరిశోధనలో వెల్లడింది. అందుకే అలారం పెట్టుకుని లేచే అలవాటును కూడా మార్చుకుని ఆటోమేటిక్ గా నిద్ర లేచే అలవాటును పెంచుకోవాలని ఈ పరిశోధన చెబుతోంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *